సీఎం జగన్ కి నారా లోకేష్ సూటి ప్రశ్న!

సీఎం జగన్ కి నారా లోకేష్ సూటి ప్రశ్న!

by Anudeep

Ads

తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు కుమారుడు  నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ అస్త్రం సంధించారు ‘ ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారు?

Video Advertisement

తొలి విడ‌త‌లో కోవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చ‌ల్లితే చ‌స్తుంది ..ఇట్ క‌మ్స్ ఇట్ గోస్..ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారుసెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మ‌శానంగా మారుతుంటే చిరున‌వ్వులు చిందిస్తూ,మీరే మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెన్ని వేల‌మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మ‌నిషిన‌ని నిరూపించుకుంటారో మీ ఇష్టం’ అంటూ విమర్శలు సంధించారు.

also Read : “లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.? ఇద్దరు ఒకరే అనుకుంటే పొరపాటే.!


End of Article

You may also like