Ads
చిత్రం : నారప్ప
Video Advertisement
నటీనటులు : వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, ఆడుకలం నరేన్, అమ్ము అభిరామి
నిర్మాత : సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
సంగీతం : మణి శర్మ
విడుదల తేదీ : జూలై 20, 2021, (అమెజాన్ ప్రైమ్)
నారప్ప రివ్యూ :
కథ :
కథ మొత్తం నారప్ప (వెంకటేష్), అతని భార్య (ప్రియమణి), కొడుకులు ముని కన్న, సిన్నబ్బ, వారు అదే ఊరిలో ఉండే పండు సామి (ఆడుకలం నరేన్) వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల చుట్టూ తిరుగుతుంది. చివరికి నారప్ప ఏం చేశాడు ? తనని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎదిరించాడా? తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? అసలు నారప్ప తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంత సైలెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటి? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమా ఆసురన్ కి రీమేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో ధనుష్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి కూడా ప్రేక్షకులలో “అసలు ఎలా ఉండబోతోంది? తమిళంలో ధనుష్ చేసినట్టే తెలుగులో వెంకటేష్ చేస్తారా? కథలో ఏమైనా మార్పులు చేస్తారా? లేకపోతే అదే కథని తెలుగులో తీస్తారా? మన నేటివిటీ కి సెట్ అవుతుందా? ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి.
నిజానికి ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అమెజాన్ లో విడుదల చేశారు. సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. మధ్యమధ్యలో డల్ గా అనిపించినా కూడా అంత పెద్దగా ఇబ్బంది కలగదు. నారప్ప సినిమాలో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి వెంకటేష్.
ఈ సినిమా మళ్లీ చాలా రోజుల తర్వాత వెంకటేష్ లోని నటుడిని చూపించింది అని చెప్పొచ్చు. మనం గత కొన్ని సంవత్సరాల నుండి వెంకటేష్ ని కమర్షియల్ సినిమాల్లోనే చూస్తున్నాం. కానీ ఈ సినిమా వెంకటేష్ ఎలాంటి పాత్ర అయినా సరే చేయగలరు అని మరొకసారి రుజువు చేసింది. ప్రియమణి, కార్తిక్ రత్నం, రాజీవ్ కనకాల మిగిలిన అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మణిశర్మ సంగీతం కూడా బాగుంది. శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకి మరొక ప్రధాన బలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించినా కూడా డిజిటల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ప్రేక్షకుల్ని నిరాశపరచదు. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ కి న్యాయం చేసే రీమేక్ సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో నారప్ప ఒకటిగా నిలిచింది.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ నటన
కథ
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా కొంచెం డల్ గా అనిపించే సీన్లు
రేటింగ్ : 3.5 / 5
ట్యాగ్ లైన్ :
ఒరిజినల్ చూసినా, చూడకపోయినా ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించిన సినిమా అయినా కూడా ఓటీటీ లో చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
End of Article