నారాయణ స్టూడెంట్ సంధ్య ఆత్మహత్య…మార్చురీ తలుపులు ధ్వంసం, కాలితో తన్నిన కానిస్టేబుల్.! (వీడియో)

నారాయణ స్టూడెంట్ సంధ్య ఆత్మహత్య…మార్చురీ తలుపులు ధ్వంసం, కాలితో తన్నిన కానిస్టేబుల్.! (వీడియో)

by Anudeep

ఫ్రెండ్లీ పోలిసింగ్ అని ట్యాగ్ లైన్ పెట్కున్న తెలంగాణా పోలీసులు ప్రాక్టికాలిటిలో జనాలకి చుక్కలు చూపిస్తున్నారు. పోలిసు స్టేషన్ కి వెళ్లడానికే భయపడే సామాన్యుల పరిస్థితి నుండి అసలెక్కడా తమ గోడును వెళ్లబోసుకోవడానికి వీల్లేకుండా, మార్చురి వరకు కూడా తమ ప్రతాపాన్ని విస్తరింపచేశారు. కూతురుని కోల్పోయిన తండ్రి పట్ల పోలీసులు ఎంత ఫ్రెండ్లీగా ప్రవర్తించారో తెలుసా? ఆఖరుకి మంత్రి కెటీఆర్ కూడా పోలీసుల తీరును తప్పుపడుతూ స్పందించక తప్పలేదు..అసలు విషయం ఏంటంటే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ పెద్ద కూతురు సంధ్య. అందరు తల్లిదండ్రుల్లానే వాళ్లు కూడా తమ పిల్లలను పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే కూతురుని నారాయణా కాలేజ్లో జాయిన్ చేశారు. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని , చదవలేకపోతున్నానంటూ కొద్దిరోజులకే సంధ్య తల్లిదండ్రులకు కాల్ చేసింది. పెద్ద చదువులు చదువుకుని జీవితంలో సెటిల్ అవుతుందనుకున్న కూతురు అలా అనేసరికి మొదట భయపడిన ఆ తల్లిదండ్రులు,తర్వాత నచ్చచెప్పారు. కూతురు సరేననడంతో హాస్టల్లో వదిలేసి వెళ్లారు.ఒకవైపు పరీక్షలు దగ్గర పడుతున్నాయి , మరోవైపు ఆరోగ్యం సహకరించకపోవడంతో హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకుని చనిపోయింది.

సంధ్య మృతదేహాన్ని పటాన్ చెరు ఆస్పత్రికి తరలించారు.విద్యార్ధి సంఘాల నేతలు , తల్లిదండ్రులు,సంధ్య కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. పటాన్ చెరు  మార్చురీలో ఉన్న సంధ్య మృతదేహన్ని విద్యార్ది సంఘాల నేతలు బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో మార్చురు తలుపులు ధ్వంసం చేసి మృతదేహాన్ని బయటికి తీస్కెళ్లెందుకు ప్రయత్నించారు. సంధ్య చావుకు అసలైన కారణం ఏంటో తెలియాలని శవపేటికలో ఉన్న సంధ్య మృతదేహాన్ని కాలేజి ముందుకు తీసుకువెళ్లి ధర్నా చేయాలని ప్లాన్ చేశారు విద్యార్ది సంఘ నేతలు .

ఒకవైపు కూతురు పోయిన బాధ , మరోవైపు కూతురు శవంతో విద్యార్దిసంఘాల నేతలు, పోలిసుల మధ్య వాగ్వివాదం రెండిటిని చూస్తున్న ఆ తండ్రి తన కూతురుని వదిలిపెట్టాలంటూ శవపేటికకు అడ్డుపడ్డాడు. అంతే అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ తండ్రిని కాలితో తీవ్రంగా తన్నాడు. వదిలిపెట్టండి బాబూ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కార్పోరేట్ కాలేజిలలో చదువుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆ ఒత్తిడి తట్టుకోలేక గతేడాది ఎంతోమంది విధ్యార్దులు బలవణ్మరణానికి పాల్పడిన విషయం కూడా విధితమే. సంధ్య మరణానికి కారణం చదువుల ఒత్తిడో? అనారోగ్యమో?? ఏదైతేనేం తల్లిదండ్రులకి కూతురుని దూరం చేసింది .

You may also like