నరేంద్ర మోడీ భార్య ఎవరో తెలుసా..? వాళ్ళు ఎందుకు విడిపోయారు అంటే..?

నరేంద్ర మోడీ భార్య ఎవరో తెలుసా..? వాళ్ళు ఎందుకు విడిపోయారు అంటే..?

by kavitha

Ads

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మోడీ నాయకత్వంలో వరుసగా రెండవసారి భారత జనతా పార్టీ భారీ మెజారిటీతో ఎన్డీయే విజయం సాధించింది. మోడి ఎనిమిదేళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్‌లో చేరారు.

Video Advertisement

అప్పటి నుండి ఆ సంస్థతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. నరేంద్ర మోడీ రాజకీయ జీవితం గురించి అందరికి సుపరిచితమే. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. ఆయనకు వివాహం అయినట్టు తెలిసినప్పటికి, ఆయన భార్య గురించి ఎక్కువ మందికి తెలియదు. నరేంద్ర మోడీ భార్య ఎవరో? వాళ్ళు ఎందుకు విడిపోయారో ఇప్పుడు చూద్దాం..
మే 2014న ఇండియాకి  14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఆయన గుజరాత్ లో 1950లో జననం సెప్టెంబర్ 17న వాద్‌నగర్‌లో జన్మించారు.  అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడింది. మోదీ  పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్‌నగర్ స్టేషన్‌ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు.
తన కుంటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడి 18 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల వయసు ఉన్న జశోదాబెన్ మోడీని వాద్‌నగర్ కుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడి తల్లి ఒత్తిడితో, జశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడి ఇంటికి వచ్చింది. కానీ మోడి ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు.
తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా జశోదాబెన్ చదువు కోవాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత ఆమెను ఎప్పుడు భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. నాలుగు దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో జశోదాబెన్ ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు.  2014 లో ఎన్నికల అఫిడవిట్‌లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. జశోదాబెన్ మోడి ఒక రిటైర్డ్ టీచర్.

Also Read: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఎలా చనిపోయింది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?

 

 

 

 


End of Article

You may also like