Ads
గత ఎనిమిదేళ్లుగా రష్మీ, సుధీర్ స్టోరీ బుల్లితెరపై హల్ చల్ చేస్తూనే వుంది. ఇద్దరి కెమిస్ట్రీతో కామెడీ చేయడం మంచి ఎంటర్టైన్మెంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా రష్మి ఒక స్కిట్ చేసింది. అది చూసి అందరూ ఆమె పై సెటైర్లు వేశారు. అయితే ఆమె ఒక స్కిట్ చేసి రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్, వర్ష వాళ్ళందర్నీ రోస్ట్ చెయ్యాలని చూసింది.
Video Advertisement
కానీ అంతా రివర్స్ అయ్యిపోయింది. ఆఖరికి ఆమె పైనే ట్రోల్స్ పడ్డాయి. ఇక అసలు ఏమైంది అనే విషయానికి వస్తే… ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి అన్యాయం చేశారు అందుకే ఇలా కట్టేసాను అంటూ రష్మీ అనగా.. ముందుగా నిన్నే కట్టేయాలని రామ్ ప్రసాద్ రష్మి కి కౌంటర్ వేసాడు. తరవాత రష్మీ నరేష్ పై కూడా పంచులు చేయాలని చూసింది.
దీనితో ఆమె షబీనా తో లవ్ సింబల్స్ వేసుకోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది. దీంతో నరేష్ ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతాడు. ఎవరు అని రష్మీ అడిగితే చిన్న పిల్లాడికి కూడా ఇదంతా స్టార్ట్ చేసింది మీరే అని… మిమ్మల్ని బూతులు తిట్టాలి, బండబూతులు తిట్టాలని నరేష్ రష్మీ పై భారీగా కౌంటర్ వేస్తాడు.
End of Article