MAD REVIEW : “ఎన్టీఆర్ బావమరిది” హీరోగా పరిచయం అయిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

MAD REVIEW : “ఎన్టీఆర్ బావమరిది” హీరోగా పరిచయం అయిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

కాలేజ్ లైఫ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో మరొక సినిమా వచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ సోదరి నిర్మాతగా పరిచయం అవుతూ మ్యాడ్ అనే సినిమా రూపొందించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : మ్యాడ్
  • నటీనటులు : రామ్ నితిన్​, నార్నే నితిన్, సంగీత్ శోభన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్.
  • నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
  • దర్శకత్వం : కళ్యాణ్ శంకర్
  • సంగీతం : భీమ్స్ సిసిరోలియో
  • విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

mad movie review

స్టోరీ :

ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డిడి (సంగీత్ శోభన్) చేరుతారు. వారి పేర్లలో మొదటి అక్షరం కలిపి MAD అని వారి గ్రూప్ కి పేరు పెట్టుకుంటారు. వారితో పాటు లడ్డు (విష్ణు) కూడా కాలేజీలో చేరుతాడు. వీరిలో మనోజ్ శృతితో ప్రేమలో పడతాడు. అశోక్ జెన్నీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దామోదర్ ని వెన్నెల అనే అమ్మాయి ప్రేమిస్తుంది. వీరి కాలేజ్ లైఫ్ ఎలా గడిచింది? అక్కడ వీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? కాలేజీలో వీళ్లు ఎలాంటి పనులు చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

mad movie review

రివ్యూ :

సాధారణంగా కాలేజీ లైఫ్ అనే కాన్సెప్ట్ మీద సాగే సినిమాలు చాలా వచ్చాయి. కొంత మంది కాలేజీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వాళ్లు ఫ్రెండ్స్ అవ్వడం​, వాళ్లకి సీనియర్స్ నుండి వచ్చే ఇబ్బందులు, అక్కడ జరిగే సరదా సంఘటనలు. ఇదే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. కానీ సినిమా ప్రజెంటేషన్ ని బట్టి సినిమా రిజల్ట్ మారుతుంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా మొత్తం కూడా కామెడీ హైలైట్ అయ్యేలాగా స్టోరీ రాసుకున్నారు.

mad movie review

చాలా వరకు ఆ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. కథ అందరికీ తెలిసిన కథ. దీని గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎక్కడ బోర్ కొట్టించకుండా టేకింగ్ ఉండేలాగా చూసుకున్నారు. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా బాగానే చేశారు. కానీ సినిమాకి మాత్రం లడ్డు పాత్ర పోషించిన విష్ణు అనే నటుడి పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యింది. చాలా వరకు కామెడీ కూడా ఈ పాత్ర ద్వారానే జనరేట్ అవుతుంది.

mad movie review

పాటలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. కాలేజ్ పాప అనే పాట తప్ప మిగిలిన పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునే అంతగా లేవు. డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే యూత్ ఫుల్ సినిమా కాబట్టి కొన్ని డైలాగ్స్ చాలా డైరెక్ట్ గా ఉన్నాయి. దాంతో కొన్ని డైలాగ్స్ మాత్రం యూత్ కాని ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • కామెడీ
  • కాలేజ్ లైఫ్ చూపించిన విధానం
  • ఫాస్ట్ గా నడిచే స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • ఇబ్బంది కలిగించే కొన్ని డైలాగ్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా చూద్దాం అనుకునే వారికి మ్యాడ్ సినిమా ఒక్కసారి చూడగలిగే మంచి కామెడీ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే… సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది..!” అంటూ… విజయ్ “లియో” ట్రైలర్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like