Home Filmy Adda నవదీప్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? అందుకు నవదీప్ ఏం సమాధానాలు ఇచ్చారు అంటే..?

నవదీప్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? అందుకు నవదీప్ ఏం సమాధానాలు ఇచ్చారు అంటే..?

by Sainath Gopi

హీరో నవదీప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా పలు సినిమాలు చేసి, సూపర్ హిట్ అందుకున్న నవదీప్ ఆ తరువాత కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే పలు కాంట్రవర్సిలు ఎదుర్కొన్న నవదీప్ కు రీసెంట్ గా ఈడీ అధికారులు డ్ర-గ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హీరో నవదీప్‌ ఈరోజు ఈడీ ఎదుట హాజరు అయ్యారు. దీంతో నవదీప్‌ను ఈడీ ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. 2017లో ఈ కేసులో నవదీప్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
టివి9 తెలుగు కథనం ప్రకారం, హీరో నవదీప్ డ్ర-గ్స్‌ వినియోగించినట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల  మాదాపూర్‌ డ్ర-గ్స్‌ కేసులో దొరికిన ప్రొడ్యూసర్ వెంకటరత్నారెడ్డి, రామ్‌చంద్‌లను విచారించగా, నవదీప్‌ పేరు బయట పడినట్టు తెలుస్తోంది. రామ్‌చంద్‌ ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్‌ కూడా తనతో పాటు కలిసి మాదకద్రవ్యాలు తీసుకున్నట్లుగా చెప్పినట్టు సమాచారం. రామ్‌చంద్‌ వాంగ్మూలంతో నవదీప్‌ పేరును కూడా నిందితుల లిస్ట్ లో చేర్చారు. కమిషనర్ సీవీ ఆనంద్ నవదీప్ పరారీలో ఉన్నాడని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే నవదీప్‌ను ఈ కేసులో సెప్టెంబర్ 23న ఈడీ అధికారులు విచారించారు. అయితే వారు అడిగిన కొన్నింటికి  నవదీప్ జవాబులు చెప్పినా, కొన్నింటిని దాటవేశారని తెలుస్తోంది. రామ్‌చంద్ పదేళ్ల కిందటే తనకు పరిచయమని, అయినప్పటికీ, తాను ఎవరికీ వాటిని ఇవ్వలేదని చెప్పారు. దాంతో 2017లో నమోదైన టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసును, మాదాపూర్ మాదకద్రవ్యాల కేసును కలిపి ఈడీ ఈరోజు నవదీప్‌ని ప్రశ్నిస్తోంది. మాదకద్రవ్యాల కేసులో ఉన్న నైజీరియన్లతో మీకున్న సంబంధం ఏమిటి? వారితో ఆర్ధిక లావాదేవీలను ఎందుకు జరిపారు?
ముగ్గురు నైజీరియన్ల మనీలాండరింగ్‌ కేసు గురించి ఏం తెలుసు? ఈడీకి మీ అకౌంట్ల అన్ని వివరాలను ఇవ్వగలరా? మీరు మేనేజర్‌ మరియు డ్రైవర్‌ అకౌంట్లతో ఏమైనా ట్రాన్సాక్షన్లు చేశారా? రామ్‌చంద్‌, కలహర్‌ రెడ్డితో ఉన్న లావాదేవీల విషయం ఏమిటి? ఈవెంట్లకు సంబంధించిన అన్ని రికార్డులను ఇస్తారా? వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కొంతమంది కీలకమైన వారి పేర్లు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే విచారణ తరువాత బయటికి వచ్చిన నవదీప్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.

Also Read: ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అనుకుంట…కానీ ఆహా ఏమని క్లారిటీ ఇచ్చింది అంటే.?

 

You may also like