Ads
చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అయిన కెరీర్‌ను మాత్రం విడిచిపెట్టరు.
Video Advertisement
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో మొదలుపెట్టిన నవీన్ పొలిశెట్టి.. ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలు హిట్ కొట్టాడు. జాతిరత్నాలు ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. కామెడీ టైమింగ్‌తో హిట్ కొట్టి అందరి గుండెల్లో నిలిచాడు నవీన్ పొలిశెట్టి.
అయితే ఒక్క హ్యాట్రిక్‌తో నవీన్ కెరీర్ మొత్తం మారిపోయింది. ఎన్నో కష్టాల నదిని దాటి.. సక్సెస్ అయ్యాడు పొలిశెట్టి. అయితే ఇటీవల రిలీజ్ అయిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా కూడా నిలిచింది. ఏళ్ల తర్వాత అనుష్క మళ్లీ థియేటర్లలో సందడి చేసింది.
ఇదిలా ఉండగా.. హ్యాట్రిక్ కొట్టిన నవీన్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ఈ సినిమాకి 3.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. సినిమా ప్రమోషన్‌కి అనుష్క లేకపోయిన సింగిల్ హ్యాండ్‌తో ప్రమోషన్ చేశాడు నవీన్ గ్రేట్ అని నెటిజన్లు అంటున్నారు.
పొలిశెట్టి ఇకపై ప్రారంభించబోయే సినిమాలకు అయితే 5కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం. యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఒక్కడే సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. కాబట్టి ఇతనికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడంలో తప్పులేదని నెటిజన్లు అంటున్నారు.
End of Article