Ads
ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభం కాదు. పైగా అవకాశాలు వచ్చినా స్థిరపడడం కూడా అంత సులభం కాదు. చాలా మంది ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతో కష్ట పడుతుంటారు. కానీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేరు.
Video Advertisement
హీరోలైలా, హీరోయిన్స్ అయినా, చైల్డ్ ఆర్టిస్ట్స్ కి అయినా ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని నటులకైతే వచ్చే అవకాశాలు తక్కువ. కానీ ట్యాలెంట్ ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడవచ్చు.
కానీ నయనతార మాత్రం చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ… లేడీ సూపర్ స్టార్ నయనతారగా ఫేమ్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తెలుగులో లక్ష్మీ, తులసి, సింహా, సైరా మొదలైన సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలిపి 75 కంటే ఎక్కువ చిత్రాల్లో నయన్ నటించింది. ఇక ఈమె ఆస్తులు గురించి చూస్తే… నయనతార ఆస్తుల విలువ $22 మిలియన్లు అంటే సుమారు రూ.165 కోట్లనమాట.
సినిమాల ద్వారానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. ఇండియా లో చాలా చోట్ల ఈమెకి ఫ్లాట్స్ కూడా వున్నాయట. నయన్ సౌత్ ఇండియన్ సినిమాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటి. అంతే కాక హైదరాబాద్‌లో రెండు ఖరీదైన భవంతులు ఈమెకి వున్నాయి. చెన్నై లో రెండు ఫోర్ BHK ఇళ్ళు కూడా వున్నాయ్. ఒకటి రూ.100కోట్ల పైనే ఉంటుంది. BMW 5 సిరీస్ తో పాటుగా BMW 7-సిరీస్, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్ ఎండీవర్ కార్లు వున్నాయి. మెర్సిడెస్ GLS 350D కారు వుంది. 88 లక్షలు ఉంటుంది ఇది. ఇంకా చాలా ఖరీదైన కార్లు వున్నాయి. అంతే కాక చాయ్ వాలే సెగ్మెంట్‌ను కూడా స్టార్ట్ చేసింది. రెనిటా రాజన్ తో కలిసి ‘ది లిప్ బామ్ కంపెనీ’ ని కూడా స్టార్ట్ చేసింది.
End of Article