Ads
నయనతార హీరోయిన్ గా నటించిన తాజా సినిమా అన్నపూరణి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు కించపరిచేలాగా ఉన్నాయని, శ్రీరాముడిని అగౌరవ పరిచేలా ఉన్నాయని,లవ్ జీహాద్ ని ప్రచారం చేశారంటూ మూవీ దర్శకుడు, నిర్మాత, నటీనటులపై మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో హిందూ సేవా పరిషత్ అనే సంస్థ కేసు వేసింది. ఈ క్రమంలో జబల్పూర్ నగరంలోని ఓమ్టి ప్రాంతానికి చెందిన పోలీసులు ఎఫ్ఐఎన్ నమోదు చేశారు.
Video Advertisement
ఇందులో హీరోయిన్ నయనతార, సినిమా దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్, నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మౌనిక షేర్గిల్ సహా ఏడుగురి పేర్లను నిందితులుగా చేర్చారు. ఈ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై డిసెంబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది. అయితే ఈ సినిమా పై వస్తున్న విభేదాల కారణంగా నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను అర్ధాంతరంగా తీసేసారు ఆ తరువాత నయనతార సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కూడా చెప్పింది.
తను, తన మూవీ టీం ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదని చెప్పింది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ద్వారా జైశ్రీరామ్ అనే హెడ్డింగ్ తో ఓం అని రాసి ఉన్న మాస్టర్ హెడ్ పై తన క్షమాపణలు తెలియజేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో మేము అనుకోకుండా కొందరిని బాధ పెట్టొచ్చు గతంలో థియేటర్లలో ప్రదర్శించబడిన సెన్సార్ అయిన చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి తీసివేస్తారని మేము ఊహించలేదు. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతోనే ఈ సినిమా చేసాం.
https://www.instagram.com/p/C2QAYrwP69S/
కేవలం ఈ సినిమా ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని భావించాము. భగవంతుడిని పూర్తిగా విశ్వసించే వ్యక్తిగా, దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శిస్తున్న వ్యక్తిగా చెబుతున్నాను ఎవరి మనోభావాలనైనా మేము కించపరిస్తే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
End of Article