Ads
- చిత్రం : కనెక్ట్
- నటీనటులు : నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా నఫీసా.
- నిర్మాత : విఘ్నేష్ శివన్
- దర్శకత్వం : అశ్విన్ శరవణన్
- సంగీతం : పృథ్వీ చంద్రశేఖర్
- విడుదల తేదీ : డిసెంబర్ 22, 2022
Video Advertisement
స్టోరీ :
ఈ సినిమా కథ అంతా కరోనా లాక్డౌన్ నేపథ్యం లో సాగుతుంది. జోసెఫ్ బినోయ్ (వినయ్ రాయ్) ఒక హాస్పిటల్ లో పని చేస్తూ ఉంటారు. ఆయన భార్య సుజన్ (నయనతార) హౌస్ వైఫ్. వారికీ ఒక కుమార్తె అన్నా ఉంటుంది. ఆ అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమెకు లండన్ హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్ లో సీట్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్లేలోపే కరోనా వచ్చి లాక్ డౌన్ వస్తుంది.
తర్వాత కరోనా రోగులకు చికిత్స చేస్తూ జోసెఫ్ బినోయ్ చనిపోతాడు. తన తండ్రిని చివరి చూపు చూడలేనందుకు బాధపడిన అన్నా.. ఆయన ఆత్మతో అయినా మాట్లాడాలని ప్రయత్నించగా.. ఒక దుష్ట ఆత్మ ఆమెలో ప్రవేశిస్తుంది. అయితే ఒంటరిగా సుజన్ ఈ పరిస్థిని ఎలా ఎదుర్కొన్నారు, తన కుమార్తె ను ఎలా కాపాడుకున్నారు అన్నదే ఈ సినిమా కథ.
రివ్యూ :
లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం లో నటించారు. మాయ చిత్రం తర్వాత నయనతార, దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రం చేసారు. అయితే ఈ కథ చాలావరకు ఒకే ఇంట్లో జరిగింది. అలాగే ఈ సినిమాలో పాత్రలు కూడా మొబైల్ స్క్రీన్స్, లాప్ టాప్స్ ద్వారానే కనెక్ట్ అయ్యి ఉంటాయి. దయ్యం ఆవహించడం, చివరికి దయ్యం పోవడం కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఇది మినహా ఇస్తే ఈ సినిమా మొత్తం రెగ్యులర్ గానే ఉంటుంది. కరోనా సమయం లో ఆప్తులకు సహాయం చేయలేని పరిస్థితుల్ని హృద్యం గా తెరకెక్కించాడు దర్శకుడు.
విరామం లేకుండా ఈ సినిమా ఉంటుంది అని ముందుగానే ప్రకటించారు మేకర్స్. కానీ కథనం అంతసేపు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టలేదు. అయితే రొటీన్ కథ ని సౌండ్ డిజైనింగ్, కెమెరా వర్క్ తో కొత్తగా ప్రెసెంట్ చేసాడు దర్శకుడు. క్లైమాక్స్ సీన్ చాలా చప్పగా సాగిపోతుంది. ఎదో ట్విస్ట్ ఉంటుందేమో అనుకున్న వారికి చివరివరకు నిరాశే ఎదురవుతుంది. నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ పాత్రలు హైలైట్ గా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్ :
- ప్రధాన పాత్రల నటన
- సినిమాటోగ్రఫీ
- అద్భుతమైన మ్యూజిక్
- ఎమోషన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- స్లో నెరేషన్
రేటింగ్ :
2 .5 /5
ట్యాగ్ లైన్ :
కనెక్ట్ సినిమా ను ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ చేయలేకపోయాడు దర్శకుడు. కానీ హర్రర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
watch trailer :
End of Article