Ads
సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క సినిమాకి కమిట్మెంట్ ఇవ్వాలి అంటే నయనతార పలు డిమాండ్స్ తో పాటు భారీగా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేయడంతో ప్రస్తుతం నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. రెమ్యునరేషన్ తో పాటు ఆమె స్టాఫ్ ఖర్చులు కూడా భరించాలి అన్న నయనతార కండిషన్ నిర్మాతల కు షాక్ ఇస్తుంది.
Video Advertisement
ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా కొందరు నిర్మాతలు ఇందుకు తపనిసరిగా ఒప్పుకోగా మరికొందరు మాత్రం అమ్మో మా వల్ల కాదు అని సైడ్ అవుతున్నారు. పెళ్లికి ముందు నయనతార సినిమాకు సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ ఈ మధ్య తను రెమ్యూనరేషన్ ను బాగా పెంచారు అని సమాచారం.
తాజాగా నయన తార మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ మూవీ లో ఆయన చెల్లెలి పాత్రలో నటించారు. ఈ మూవీ లో నయన తార కు జోడిగా సత్యదేవ్ నటించారు. ఈ మూవీ ట్రైలర్ లో నయనతార నటన అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా కాకుండా కేవలం చెల్లెలి పాత్రలో నటించినందుకు ఆమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
చాలా తక్కువ కాల్ షీట్స్ ఇచ్చినప్పటికీ….భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ లో టాక్. కాని ఆమెకు ఉన్న ఫాలోయింగ్ వల్ల నిర్మాతలు మారు మాట్లాడకుండా అంగీకరిస్తున్నారు. ఓ పక్క గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్ని డబ్బింగ్ వర్క్ లో బిజీ గా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆచార్య ఫ్లాప్ అయిన తర్వాత రాబోయే మెగాస్టార్ మూవీ పై అభిమానులు బాగా ఆశలు పెట్టుకున్నారు.
End of Article