Ads
రోజులో ఎనిమిది సార్లు కంటే ఎక్కువగా యూరిన్ కి వెళ్లాల్సి వస్తోంది అంటే అది అతిమూత్ర వ్యాధి కిందకే వస్తుంది. తరచుగా వెళ్లాల్సి వస్తుండడం.. రాత్రి పూట కూడా నిద్ర లో ఉండగా రెండు మూడు సార్లు లేచి వెళ్లాల్సి రావడం, ఆపుకోలేకపోవడం, లోదుస్తుల్లోనే కొంత పడిపోవడం వంటి ఇబ్బందులు ఉంటె మీరు ఈ విషయమై డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్తపడాలి.
Video Advertisement
అతిమూత్ర సమస్య రెండు రకాలుంటుంది. తడి అతి చురుకైన మూత్రాశయం, పొడి అతి చురుకైన మూత్రాశయం. వీటిల్లో తడి గా ఉండేదానికే ఎక్కువ గా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. తరచుగా యూరిన్ కి వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది. దాదాపు యాభై శాతం మంది మహిళలు తమ జీవితం లో ఒక్కసారైనా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారట. అతిమూత్ర సమస్య వలన నోరు ఎండిపోవడం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇది తగ్గించుకోవాలంటే రాత్రి సమయం లో ఎక్కువ గా ద్రవ పదార్ధాలు తీసుకోకూడదు. పాలు, మజ్జిగ వంటివి తాగడం వలన ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అధికబరువు తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను కూడా తగ్గించుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి.
End of Article