Ads
అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని అంటుంటారు . అప్పట్లో ధైర్యంగా పెళ్లి కాకుండానే ఒక పాపకి జన్మనిచ్చి సమాజాన్ని సవాల్ చేసి ముందుకు నడిచిన నీనా గుప్తా , ముఫ్పై ఏళ్లు గడిచాక సమాజంలో ఎలా నడుచుకోవాలో అనే విషయాన్ని నా జీవితమే – నా సందేశం అంటూ చెప్తుంది. అప్పట్లో సమాజం ముందు రెబల్ స్టార్ లా కనపడిన నీనాగుప్తా, సమాజంలో బతుకుతూ వస్తూ సగటు మహిళగా తాను కూడా సమాజంలో భాగమే అని తన స్వీయానుభవాన్ని జోడించి ఈ తరానికి జీవిత పాఠాన్ని బోధిస్తుంది. ఎవరీ నీనాగుప్తా? ఏమా కథ?
Video Advertisement
ఇటీవల సూపర్ హిట్ అయిన ఆయుష్మాన్ ఖురానా సినిమా “బదాయి హో” లో హీరో తల్లి పాత్ర పోషించిన నటి నీనాగుప్త . లేటు వయసులో పిల్లల్ని కనే మహిళగా ఈ సినిమాలో నటించిన నీనాగుప్త ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా అందరికి సుపరిచితమే. 1982వ సంవత్సరంలో సాత్ సాత్ అనే చిత్రంలో నటించి హిందీ సినీ పరిశ్రమకు పరిచయమైన నీనా అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఒకప్పుడు బాలీవుడ్లోని దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది.అయితే కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో వెస్టిండీస్ క్రికెటర్ వివి రిచర్డ్స్ తో ప్రేమలో పడింది.
నీనా గుప్తా, రిచర్డ్స్ ల ప్రణయానికి ముందే రిచర్డ్స్ కి పెళ్లయింది. ఆ విషయం తెలిసినా కూడా దాదాపుగా పదేళ్లకు పైగా ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో నీనా గుప్తా కి ఒక బిడ్డ కూడా జన్మించింది . ఆ బిడ్డకి తండ్రెవరో చాలా కాలం పాటు గుప్తంగానే ఉంది. ఆ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒకవైపు వివి రిచర్డ్స్ భార్య తరచు వివాదాలు పడుతుండటంతో నీనా గుప్తా ని రిచర్డ్స్ వదిలిపెట్టాల్సి వచ్చింది.
ఇదే విషయంపై నీనా గుప్తా ఇటీవల సోషల్ మీడియాలో స్పందించింది. జీవితంలో ఎవరూ లేకపోతే ఒంటరిగా అయినా బ్రతకాలి కానీ పెళ్లి అయిన వ్యక్తితో మాత్రం ఎఫైర్ పెట్టుకోవద్దని నా అనుభవంతో చెబుతున్నానని ఓ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . భర్త లేక తాను, తండ్రి లేక తన కూతురు సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నామని వాపోయింది నీనా గుప్తా.
ఈ విషయంపై కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే , మరికొందరు ఒకప్పుడు సమాజాన్ని ఎదిరించి నిలిచిన ఆ నీనా గుప్తేనా అని ఆశ్చర్యపోతున్నారు . ఏటికి ఎదురీదడం అనేది మామూలు విషయం కాదు , ఎంత తెగింపుతో మొదలుపెట్టామో , అంతకు రెట్టింపు స్థైర్యంతో ముందుకు వెళ్లగలగాలి .
watch video:
View this post on Instagram
End of Article