• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

నా అనుభవంతో చెబుతున్నా…వారితో అస్సలు సంబంధం పెట్టుకోకండి..! హీరోయిన్ సంచలన కామెంట్స్!

Published on March 4, 2020 by Anudeep

అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని అంటుంటారు . అప్పట్లో ధైర్యంగా పెళ్లి కాకుండానే ఒక పాపకి జన్మనిచ్చి సమాజాన్ని సవాల్ చేసి ముందుకు నడిచిన నీనా గుప్తా , ముఫ్పై ఏళ్లు గడిచాక సమాజంలో ఎలా నడుచుకోవాలో అనే విషయాన్ని నా జీవితమే – నా సందేశం అంటూ చెప్తుంది. అప్పట్లో సమాజం ముందు రెబల్ స్టార్ లా కనపడిన నీనాగుప్తా, సమాజంలో బతుకుతూ వస్తూ సగటు మహిళగా తాను కూడా సమాజంలో భాగమే అని తన స్వీయానుభవాన్ని జోడించి ఈ తరానికి జీవిత పాఠాన్ని బోధిస్తుంది. ఎవరీ నీనాగుప్తా? ఏమా కథ?

ఇటీవల సూపర్ హిట్ అయిన ఆయుష్మాన్ ఖురానా సినిమా “బదాయి హో” లో హీరో తల్లి పాత్ర పోషించిన నటి నీనాగుప్త . లేటు వయసులో పిల్లల్ని కనే మహిళగా ఈ సినిమాలో నటించిన నీనాగుప్త ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా అందరికి సుపరిచితమే. 1982వ సంవత్సరంలో సాత్ సాత్ అనే చిత్రంలో నటించి హిందీ సినీ పరిశ్రమకు పరిచయమైన నీనా అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఒకప్పుడు బాలీవుడ్లోని దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది.అయితే కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో వెస్టిండీస్ క్రికెటర్ వివి  రిచర్డ్స్ తో ప్రేమలో పడింది.

నీనా గుప్తా, రిచర్డ్స్ ల ప్రణయానికి ముందే రిచర్డ్స్ కి పెళ్లయింది. ఆ విషయం తెలిసినా కూడా దాదాపుగా పదేళ్లకు పైగా ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో నీనా గుప్తా కి ఒక బిడ్డ కూడా జన్మించింది . ఆ బిడ్డకి తండ్రెవరో చాలా కాలం పాటు గుప్తంగానే ఉంది. ఆ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఒకవైపు  వివి  రిచర్డ్స్ భార్య  తరచు వివాదాలు పడుతుండటంతో నీనా గుప్తా ని రిచర్డ్స్ వదిలిపెట్టాల్సి వచ్చింది.

ఇదే  విషయంపై నీనా గుప్తా ఇటీవల సోషల్ మీడియాలో స్పందించింది.  జీవితంలో ఎవరూ లేకపోతే ఒంటరిగా అయినా బ్రతకాలి కానీ పెళ్లి అయిన వ్యక్తితో మాత్రం ఎఫైర్ పెట్టుకోవద్దని నా అనుభవంతో చెబుతున్నానని ఓ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది . భర్త లేక తాను, తండ్రి లేక తన కూతురు సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నామని వాపోయింది నీనా గుప్తా.

ఈ విషయంపై కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే , మరికొందరు ఒకప్పుడు సమాజాన్ని ఎదిరించి నిలిచిన ఆ నీనా గుప్తేనా అని ఆశ్చర్యపోతున్నారు . ఏటికి ఎదురీదడం అనేది మామూలు విషయం కాదు , ఎంత తెగింపుతో మొదలుపెట్టామో , అంతకు రెట్టింపు స్థైర్యంతో ముందుకు వెళ్లగలగాలి .

watch video:

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on Mar 2, 2020 at 1:51am PST


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “సమంత” ఆ పోస్ట్ పెట్టి… మళ్ళీ ఎందుకు డిలీట్ చేసింది..? కారణం ఇదేనా..?
  • “ఈశ్వరీ రావు”తో పాటు… “సలార్”లో ఉండబోయే KGF-2 పాత్రలు వీరేనా..?
  • ఆటో డ్రైవర్లు ఇలా సైడ్ కి ఎందుకు కూర్చుంటారు.? వెనకున్న కారణాలు ఇవే.!
  • Big Boss 6 Telugu కంటెస్టెంట్ అవ్వాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!
  • సమంతని టార్గెట్ చేస్తూనే చైతు ఆ మాట అన్నాడా..? హాట్ టాపిక్ గా మారిన ఆ డైలాగ్ దేని గురించి?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions