2016 లో 100 కిలోల బరువు తగ్గిన “అంబానీ కొడుకు”…మళ్ళీ ఇప్పుడు బరువు ఎందుకు పెరిగారో తెలుసా.?

2016 లో 100 కిలోల బరువు తగ్గిన “అంబానీ కొడుకు”…మళ్ళీ ఇప్పుడు బరువు ఎందుకు పెరిగారో తెలుసా.?

by Anudeep

Ads

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో ఒకరైన ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం గత శుక్రవారం జరిగింది. చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ తో అనంత్ కి నిశ్చితార్థం జరిగింది. అంబానీల ఐకానిక్ బిల్డింగ్ ఆంటీలియా నివాసంలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Video Advertisement

అయితే ఈ ఫొటోల్లో అనంత్‌ అంబానీ భారీ కాయంతో కనిపించారు. గతంలో భారీగా బరువు తగ్గి నాజుగ్గా మారిన అనంత్ మళ్లీ బరువు పెరగడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే 2016లో 200 కిలోల నుంచి 100 కిలోల వరకు బరువు తగ్గిన అనంత్, మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై అనంత్ తల్లి నీతా అంబానీ తాజాగా స్పందించారు.

neetha ambani about anant ambani..

“గతంలో 100 కిలోల వరకు బరువు తగ్గి చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచాడు అనంత్. ఆ తర్వాత నా కుమారుడు తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు. వీటి దుష్ప్రభావాల కారణంగానే అనంత్‌ మళ్లీ బరువు పెరిగాడు.” అని తెలిపారు. అలాగే అతడిపై వస్తున్నా ట్రోల్స్ పై కూడా నీతా స్పందించారు.

neetha ambani about anant ambani..

” అనంత్‌ ప్రతి రోజూ 5-6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు. నా కుమారుడిలాగా ఊబకాయంతో పోరాడుతున్న వారు మనచుట్టూ చాలామందే ఉంటారు. దయచేసి అలాంటివారిని చిన్నచూపు చూడకండి. వారు మరింత మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. వీటికి బదులు బరువు తగ్గేందుకు మంచి సలహాలు, సూచనలు అందించండి.” అని నీతా పేర్కొన్నారు.

neetha ambani about anant ambani..

అయితే ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులకు వైద్యులు స్టెరాయిడ్స్ ను సూచిస్తారు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా, శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. కానీ ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులకు వైద్యులు స్టెరాయిడ్స్ ను సూచిస్తారు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాకుండా, శ్వాసకోశాల్లో వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆస్థమా సమస్య ఉన్న వారు శారీరక వ్యాయామాలు చేయడం కష్టంగా ఉంటుంది. దీంతో క్రమం గా బరువు పెరుగుతారు.


End of Article

You may also like