Ads
2018 లో రవితేజ హీరోగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా నేల టికెట్. ఈ సినిమాలో జగపతి బాబు, పోసాని కృష్ణ మురళి, అలీ, కౌముది ముఖ్య పాత్రలు పోషించారు. శక్తి కాంత్ కార్తీక్ సంగీత దర్శకత్వం వహించారు. నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు మాళవిక శర్మ. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు మాళవిక శర్మ ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించారు. నేల టికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నారు.
Video Advertisement
నేల టికెట్ తర్వాత చాలా కాలం వరకు వేరే సినిమాలో కనిపించలేదు. రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్నారు మాళవిక శర్మ. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయింది.
ఇప్పటికే ఈ సినిమాలో రామ్, మాళవిక శర్మ మీద చిత్రీకరించిన పాట లిరికల్ వీడియో విడుదల చేశారు.NTv కథనం ప్రకారం ఇటీవల ఒక సందర్భంలో మాళవిక శర్మ తనకి ఉన్న ఒక డిసార్డర్ గురించి చెప్పారు. మాళవిక శర్మ ఒక క్లేప్టోమేనియాక్. అంటే మాళవిక శర్మ కి క్లేప్టోమేనియా అనే ఒక డిసార్డర్ ఉంది.క్లేప్టోమేనియా ఉన్న వాళ్లకి ఏదైనా దొంగతనం చేయాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది.
దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. మాళవిక శర్మ మాత్రం కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని, కానీ చిన్న చిన్నవి మాత్రమే దొంగతనం చేశారు అని, అంతే కాకుండా తనతో ఉన్న వాళ్లు తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని, తన మానసిక స్థితి గురించి తనని అలర్ట్ చేస్తారు అని చెప్పారు.
End of Article