కన్నవాళ్ళు వదిలేశారు.. పెంచుకున్న వాళ్ళు చనిపోయారు.. ఈ చిన్నారికొచ్చిన కష్టం తెలిస్తే కన్నీళ్లే..!

కన్నవాళ్ళు వదిలేశారు.. పెంచుకున్న వాళ్ళు చనిపోయారు.. ఈ చిన్నారికొచ్చిన కష్టం తెలిస్తే కన్నీళ్లే..!

by Anudeep

Ads

ఈ చిన్న పాపకు వచ్చిన కష్టాలు తెలిస్తే.. కన్నీళ్లే కన్నీరు పెట్టుకుంటాయి.. అంతటి విషాదం ఈ పాప జీవితం లో చోటు చేసుకుంది. ఈ పాప పుట్టగానే ఆమెను కన్న తల్లితండ్రులు నడిరోడ్డు పై వదిలేసారు. ఆ తరువాత ఆమెను దత్తత తీసుకుని పెంచుకున్నవాళ్ళు కూడా ఈ లోకాన్ని వీడడం తో.. పదకొండేళ్లకే ఆమె రెండు సార్లు అనాధ గా మిగిలింది.

Video Advertisement

nellore little girl

2010 లో జన్మించింది ఈ పాప. రోజుల వయసులో ఉండగానే.. ఆమె తల్లితండ్రులు నడిరోడ్డుపై వదిలేస్తే.. స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు ఆ పాప ను చేరదీశారు. కలెక్టరేట్ విభాగం లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న పీలం రమణయ్య అనే ఓ వ్యక్తి ఆ పాప ను చూసి జాలిపడి తన కూతురు గా దత్తత తీసుకున్నారు. రెండేళ్లు అవుతున్నా ఆ పాపకి మాటలు రాకపోవడం తో.. ఆ పాప పుట్టడం తోనే మూగ, చెముడు అని తెలుసుకున్నారు.

nellore little girls 2

అయినా.. ఆ పాపను వదిలేయలేదు. ఆ పాప వారింట్లో అడుగు పెట్టినతర్వాత వారికి మంచి జరిగింది. రమణయ్య కు కూడా సూళ్లూరు పేట డీటీగా ప్రమోషన్ రావడం తో.. ఆ పాప తమ ఇంటి అదృష్టం అనుకున్నాడు. అంత బాగా నడుస్తోందన్న టైం లో రమణయ్యకు అనారోగ్యం చేసి మరణించారు.. ఆయన భార్య దొరసానమ్మ ఆ పాపలోనే భర్తను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సమయం లో ఆమెను కరోనా కాటేసింది. ఆమెకూడా ఈ లోకాన్ని వీడారు.

nellore girl

చివరకు.. ఆ పాప తాను ఎక్కడ నుంచి దత్తత వచ్చింది మళ్ళీ అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. ఆ కుటుంబ బంధువులు ఆస్తి పై కన్నేశారు కానీ.. ఆ పాపను మాత్రం పెంచుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీనితో.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులే ఆ పాప ఆలనా పాలన చూస్తున్నారు.


End of Article

You may also like