Ads
సినిమా వాళ్ళు ఎదుర్కొనే కష్టాలను రియలిస్టిక్ గా చూపించిన సినిమాల్లో నేనింతే ఒకటి. రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తో పోలిస్తే అంతగా ప్రజాదరణ పొందలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది అభిమానులు ఉన్నారు.
Video Advertisement
ఇప్పటికి కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో, బెస్ట్ సినిమాల లిస్ట్ లో నేనింతే కూడా ఉంటుంది అని అంటారు. అంత రియలిస్టిక్ గా తీసిన ఈ సినిమాలో అంతే నాచురల్ గా పర్ఫార్మ్ చేసిన రవితేజకు ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు సియా గౌతమ్. సియా గౌతమ్ కి ఇదే మొదటి సినిమా. నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు సియా గౌతమ్.
ఆ తర్వాత 2016 లో 7 ప్రేమ కథలు అనే సినిమాలో నటించారు. సంజయ్ దత్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చిన హిందీ సినిమా సంజు లో సియా గౌతమ్, సంజయ్ దత్ సోదరి అయిన ప్రియా దత్ పాత్రలో నటించారు.
సియా గౌతమ్ కి అదితి గౌతమ్ అని మరొక పేరు కూడా ఉంది. అదే ఆమె అసలు పేరట. తన సోషల్ మీడియా అకౌంట్ పేరు కూడా అదితి గౌతమ్ అని ఉంటుంది. ప్రస్తుతం సియా గౌతమ్ ముంబై లో ఉంటున్నారు. సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు.
End of Article