Ads
తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU )ఈ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆ సినిమాలు డైరెక్ట్ చేసేది లోకేష్ కనగరాజ్ కాబట్టి. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు లోకేష్. తాను క్రియేట్ చేసిన యూనివర్స్ లో అనేక పాత్రలను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాడు.
Video Advertisement
అలాంటి పాత్రలలో చాలా కీలకమైన పాత్ర నెపోలియన్. ఖైదీ సినిమా చూసిన ఎవరికైనా సరే నెపోలియన్ పాత్ర బాగా గుర్తుంటుంది. ఆ పాత్ర చేసిన నటుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ అతను ఎవరు?
నెపోలియన్ పాత్ర చేసిన నటుడు అసలు పేరు జార్జ్ మరియన్. చెన్నైలో పుట్టిన ఇతను 1989లో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. అలా 13 ఏళ్లపాటు ఇందులోనే కొనసాగాడు. 2002లో అళగి మూవీతో తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఇప్పటివరకు 70 చిత్రాల్లో నటించాడు.ఖైదీ సినిమాలోని నెపోలియన్ అనే కానిస్టేబుల్ గా నటించిన జార్జ్ మరియన్ ఈ మధ్య రిలీజ్ అయిన లియో సినిమాలోనూ గెస్ట్ ఆపిరియన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో విజయ్ ఎంట్రీ కి ఎంత హంగామా చేశారో ఫాన్స్ నెపోలియన్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అదే రేంజ్ రిసౌండ్ సృష్టించారు.
ఇక మూవీ చివరలో హీరో ఫ్యామిలీని కాపాడే టైంలో అతడి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవలనే చెప్పాలి. ఇలా 60 ఏళ్ల తర్వాత ఈ నటుడు స్టార్ డం సంపాదించాడు.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించిన నెపోలియన్ పాత్ర డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తర్వాత తీయబోయే ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 చిత్రాల్లో కూడా కనిపించడం గ్యారంటీ. ఇలా అస్సలు ఊహించిన విధంగా లేటు వయసులో యంగ్ హీరోలకి మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ నటుడు.
Also Read:“రణవీర్ సింగ్” కంటే ముందు… “దీపికా పదుకొనే” రిలేషన్‌షిప్‌లో ఉన్న 8 మంది సెలబ్రిటీలు..!
End of Article