చాలా మంది తెలుగు హీరోయిన్స్ కంటే ఈ అమ్మాయి బాగా నటిస్తుంది ఏమో..! ఈమె ఎవరంటే..?

చాలా మంది తెలుగు హీరోయిన్స్ కంటే ఈ అమ్మాయి బాగా నటిస్తుంది ఏమో..! ఈమె ఎవరంటే..?

by kavitha

Ads

ఒకప్పుడు మలయాళ సినిమాలంటే చిన్న చూపు ఉండేది. కానీ ఓటీటీలు వచ్చిన తరువాత మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగింది. ప్రతివారం ఓటీటీలో మలయాళ సినిమాలు తెలుగు వెర్షన్ లో రిలీజ్ అవుతూ తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాయి.

Video Advertisement

తెలుగులో మలయాళ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాంతో అక్కడ విజయం సాధించిన చిత్రాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా అని ఎదరుచూసేవారు పెరిగారు. ఈ క్రమంలో అక్కడి నటీనటులు పాపులర్ అవుతున్నారు. అలా ఇటీవల కాలంలో పాపులర్ అయిన నటి అనశ్వర రాజన్. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియమణి నటించిన ‘నెరు’ మూవీ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ డిసెంబర్ 21 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కీలక పాత్ర సారా మహమ్మద్. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. చూపు లేని అమ్మాయి పాత్రలో అనశ్వర రాజన్ అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
కంప్లీట్ స్టార్ గా పేరుగాంచిన మోహన్ లాల్ తో నటించడం అంత సులభమైన విషయం కాదు. అయితే అనశ్వర పాత్ర మోహన్ లాల్ తో పాటు ట్రావెల్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు మళ్లించడంలో విజయం సాధించింది. అందువల్లే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ఎవరా అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆమె కేరళలో ‘కరివెల్లూర్’ అనే టౌన్ లో 2002లో సెప్టెంబరు 8న జన్మించింది. అక్కడే పెరిగింది.
అనశ్వర 2017లో  ‘ఉదాహరణం సుజాత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 2019 లో తన్నీర్ మథన్ దినంగల్  చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. పలు చిత్రాలలో నటించి, ఫాలోయింగ్ ను పెంచుకుంది. మలయాళ యంగ్ హీరోలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది. యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. నెరు మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లోస్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: “ఆ హీరోకి పద్మ విభూషణ్ రావాలి..!” అంటూ… “పూనమ్ కౌర్” కామెంట్స్..! పోస్ట్ లో ఏం ఉందంటే..?

 

 


End of Article

You may also like