“ఆ హీరోకి పద్మ విభూషణ్ రావాలి..!” అంటూ… “పూనమ్ కౌర్” కామెంట్స్..! పోస్ట్ లో ఏం ఉందంటే..?

“ఆ హీరోకి పద్మ విభూషణ్ రావాలి..!” అంటూ… “పూనమ్ కౌర్” కామెంట్స్..! పోస్ట్ లో ఏం ఉందంటే..?

by kavitha

మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించారు. మెగాస్టార్ కు పద్మ విభూషణ్ ప్రకటించడంతో సినీ, పొలిటికల్ లీడర్లు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Video Advertisement

ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతుండగా,  కొందరు సినీ ప్రముఖులు ఇంటికి వెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే వారికి భిన్నంగా ఓ హీరోయిన్ మాత్రం సోషల్ మీడియాలో ఒక హీరోకి అవార్డు రావాలి అంటూ పోస్ట్ చేసారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో సినీ ప్రముఖులు  ఆయన నివాసానికి వెళ్లి అభినందిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అలీ, సందీప్ రెడ్డి వంగా నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ లు కూడా వెళ్లి చిరంజీవిని అభినందించారు. తాజాగా నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది.అందులో ‘‘ బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డ్‌ అందుకోవడానికి అర్హులు. ఆయన కరోనా టైమ్ లో చేసిన సేవ ఎనలేనివి. కానీ ఆయనకు ఏ పొలిటికల్ లీడర్ ని కాకాపట్టడం తెలియదు’’ అని రాసుకొచ్చింది.  ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజెన్లు ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. పూనమ్ కౌర్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సామాజిక మధ్యమాలలో యాక్టీవ్‌గా ఉంటూ తరచూ వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె కామెంట్స్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

Also Read: “రుద్రవీణ” సినిమా జనాలకి ఎలా అర్ధం అయ్యింది..? ఈ నెటిజెన్ చెప్పిన సమాధానం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!


You may also like

Leave a Comment