Ads
సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాము వెళ్లే ఈవెంట్లను, తమ పర్సనల్ ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటే.
Video Advertisement
ఇలా ఈ ఫోటోలకు వారి వారి అభిమానులు మంచి మంచి కామెంట్లు చేస్తూ లైకులు కొడుతూ షేర్లు చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోలు హీరోయిన్లు ఫోటోలను తమ ఫోన్లలో సేవ్ కూడా చేసుకుంటూ ఉంటారు.
ఇలాగే ప్రముఖ సింగర్ సునీత కూడా తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోకి రజిని బాబు అనే వ్యక్తి యు ఆర్ లూకింగ్ అమేజింగ్ అంటూ కామెంట్ పెట్టారు. ఇక్కడితో బానే ఉంది. అయితే రజిని బాబు కామెంట్ కి వెంకటలక్ష్మి ప్రత్తిపాటి అనే ఆమె తిరిగి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే “ఓ అవునా” అంటూ కామెంట్ చేశారు.
అయితే ఈ కామెంట్ లో ఏముంది అనుకుంటున్నారా…? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. రజనీ బాబు కామెంట్ కి రిప్లై ఇచ్చింది ఎవరో కాదు అతని భార్య. రజిని బాబు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అందులో మ్యారేజ్ టు వెంకట లక్ష్మి ప్రత్తిపాటి అని ఉంది. ఇక తతంగమంతా చూసిన సోషల్ మీడియా యూజర్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు.ఈ భార్యాభర్తల మధ్య కామెంట్లు భలే ఫన్నీగా అనిపిస్తుంది. వీరిద్దరి కామెంట్లు చూసిన నెటిజన్లు రజనీ బాబుకి ఇంటికి వెళ్ళాక వెంకటలక్ష్మి చేతులో ఉంటుందిలే అంటూ సిల్లీగా రిప్లై ఇస్తున్నారు
End of Article