“ఆదిపురుష్” సినిమా గురించి.. ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!!

“ఆదిపురుష్” సినిమా గురించి.. ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!!

by kavitha

Ads

ఆదిపురుష్ కొన్ని రోజులుగా వివాదాలు, విమర్శలు చుట్టుకుంటున్న చిత్రం. తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని  తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.

Video Advertisement

రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం పై సినీ సెలెబ్రెటీలు విమర్శలు చేస్తున్నారు. రామాయణాన్ని ఆదిపురుష్ పేరుతో అపహాస్యం చేశారని, దర్శకుడు ఓంరౌత్ కి రామాయణం మీద కనీస అవగాహన కూడా లేదని మండిపడుతున్నారు. ఈ మూవీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికే కోరాలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
adipurush “ఆది పురుష్ మూవీ చూసారా.. చూస్తే మీ అభిప్రాయం పంచుకోగలరు” అని అడిగిన ప్రశ్నకు కిరణ్ అనే యూజర్  ఆదిపురుష్ ఇంద్రజిత్ పాత్ర ఫోటోను షేర్ చేస్తూ ఇలా సమాధానం ఇచ్చారు. “ఈ వ్యక్తి  పూరీ జగన్నాధ్ చిత్రాలలో బ్యాంకాక్ లో తప్పుడు పదార్ధాలు అమ్మేవాడిలా ఉన్నాడు. రావణుడి కుమారుడు అయిన ఇంద్రజిత్ కి ఈ టాటూలు ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏమిటో అర్ధం కావట్లేదని అన్నారు.
prabhas fans worried about aadipurush result..!! ఇది మాత్రమే కాకుండా దర్శకుడు ఓం రౌత్ సినిమాటిక్ లిబర్టీ పేరుతో రావణుడితో వెల్డింగ్ వర్క్, అనకొండలతో మసాజ్ చేయించుకున్నట్లు ఇలాంటివి చాలానే చేయించాడు. రామాయణ క్యారెక్టర్ల ఔచిత్యాన్ని తగ్గించేలా తెరకెక్కించాడు. ఆదిపురుష్ మూవీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని ఇంతగా వక్రీకరించి తియ్యాలనే ఆలోచన ఓం రౌత్ ఎలా వచ్చిందో తెలియదు.
రామాయణం చదివిన వారికి ఇలాంటి సీన్స్ పంటికింద పడిన రాళ్ళలా అనిపిస్తాయి. ఆ ఇబ్బందిని పక్కన పెడితే ఆది పురుష్ మూవీ బాగుంది. ఇక ఈ మూవీ పై వస్తున్న విమర్శలు, మీమ్స్ ని పక్కనపెట్టి థియేటర్ లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది” అని కిరణ్ వివరించారు.

Also Read: “ఆదిపురుష్” ఫైట్ సీన్ కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి అంటే..?


End of Article

You may also like