“టైగర్ నాగేశ్వరరావు” మూవీ గురించి ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!

“టైగర్ నాగేశ్వరరావు” మూవీ గురించి ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!

by kavitha

Ads

మాస్ మహారాజా రవితేజ లేటస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీలో హీరోయిన్‌గా నూపూర్ సనన్  నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ తొలి షోతోనే మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది.

Video Advertisement

ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. రేణు దేశాయ్ చాలా కాలం తరువాత ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ గురించి కోరాలో అడుగగా, ఒక నెటిజెన్ ఇచ్చిన జవాబు నవ్వుతెప్పిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..tiger nageswara rao movie review“రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఎలా ఉంది?” అని కోరాలో అడుగగా, దానికి సుధీర్ వర్మ తిరుమలరాజు అనే యూజర్ సమాధానం ఇస్తూ, “డబ్బులు ఎక్కువ అయితే మందు తాగాలి, ఫారెన్ ట్రిప్ కి పోవాలి. కథలు లేకపోతే కోరా సమాధానాలు చదువుకోవాలి అంతేగానీ ఏంటండీ ఈ రాడ్ రంబోలా. టైగర్ నాగేశ్వరరావు చెప్పి దొంగతనం చేస్తాడు.
tiger nageswara rao movie reviewహీరో రవితేజ, చెప్పి మరీ ఫ్లాప్ కొడతాడు. అప్పుడెప్పుడో రాజా ది గ్రేట్ తరువాత గజనీ మహ్మద్ లాగా మన మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. సినిమా లిబర్టీ పేరుతో మనల్ని పోస్ట్ మర్టం చేస్తున్నారు. థియేటర్ నుండి బయటకి రాగానే కప్పుడు కెపచినో తాగితే తప్ప బుర్ర కూల్ అవ్వలేదు. ఓవెన్ లో పెట్టి వేడి చేసినట్లు హీట్ ఎక్కిపోయింది.
tiger nageswara rao censor talkకామెడీ నిల్, పోని కథకు కామెడీ అవసరం లేదు అనుకుందాం, డ్రామా ఇంకా నిల్. యాక్షన్ లో కూడా గొప్పగా ఏం లేదు. రోత కూరగాయల నరుకుడు ఫైట్స్ ఏ అన్నీ. రేణు దేశాయి పాత్రకి న్యాయం లేదు. సర్లెండి కథలోకి వెళ్ళకుండా పై మెరుగులు మాత్రమే చెబుతున్నా, చూడాల్సిన సినిమా ఒక్క శాతం కూడా కాదు. చూసిన తరువాత మీ డబ్బులు వాపసు ఇవ్వరు” అంటూ రాసుకొచ్చారు.

ALSO READ : “ఘరానా మొగుడు” సినిమా ఎన్నోసార్లు చూసే ఉంటారు…కానీ ఈ సీన్ లో ఇది ఎప్పుడైనా గమనించారా.?

You may also like