చాలాసార్లు పాత హిట్ మూవీ పాటలను కొత్త సినిమాల్లో రీమేక్ చేయడం చూస్తుంటాం…కొన్ని ట్యూన్స్ ను కూడా అక్కడక్కడా వాడటం గమనిస్తాం. అయితే రెండు సూపర్ హిట్ సినిమాలకు ఒకేలాంటి మ్యూజిక్ వాడారు ఆ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన వ్యక్తి. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి అనుకుంటున్నారా…. ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన ఛత్రపతి…చిరంజీవికి మంచి హిట్ అందించిన ఘరానా మొగుడు.

Video Advertisement

2005లో రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా విడుదలైన సూపర్ డూపర్ హిట్ చిత్రం ఛత్రపతి. తల్లి కొడుకుల సెంటిమెంట్ ని హైలైట్ చేస్తూ ప్రభస్ ను మాచో మాన్ గా టాలీవుడ్ కి పరిచయం చేసిన చిత్రం ఇది. ఈ మూవీకి స్టోరీ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో హైలెట్ గా నిలిచింది. మరి ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలలో మ్యూజిక్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటి మూవీలోని మ్యూజిక్ వేరే సినిమా నుంచి కాపీ కొట్టారు….

watch video:

ఈ మూవీలో ప్రభాస్ వచ్చేటప్పుడు వెనుక వచ్చే మ్యూజిక్ ఒకప్పటి చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో చిరుకి నగ్మా కి మధ్య జరిగే ఒక సీన్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడడం జరిగింది. తమాషా అయిన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నది కీరవాణి గారే.

watch video: