Ads
మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.
Video Advertisement
తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే విధంగా తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా తెలుగులో విడుదల అవుతోంది. తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ భాషలైన కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విడుదల అవుతోంది.
ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ చూస్తే ఒక మాల్ హైజాక్ చేస్తారు అని, అందులో చిక్కుకుపోయిన వాళ్ళని హీరో కాపాడతాడు అని మనకి అర్థమవుతుంది. సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా దాదాపు ఒకటే కాస్ట్యూమ్ తో కనిపిస్తారు. ఇలాంటి డిఫరెంట్ రోల్ లో విజయ్ నటించడం కూడా ఇదే మొదటి సారి. గత కొద్ది సంవత్సరాల నుండి విజయ్ కి తెలుగులో కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఈ సినిమా క్రేజ్ ఇక్కడ కూడా బాగుంది. సినిమా బృందమంతా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. కానీ విజయ్ మాత్రం ప్రమోషన్స్ కి రావట్లేదు.
ఇటీవల తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు. కానీ విజయ్ మాత్రం రాలేదు. అంతకుముందు కూడా మాస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా విజయ్ రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. దాంతో, “అసలు ప్రమోషన్స్ కి కూడా రాని హీరో సినిమాకి మనం అంత ఆసక్తి చూపించడం అవసరమా?” అని కామెంట్ చేస్తున్నారు.
End of Article