Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి తెల్లవారుజామున 5:12 కు టీజర్ విడుదల చేసిన ఘనత ప్రభాస్ ‘సలార్’ కి దక్కింది.
Video Advertisement
ప్రభాస్ అభిమానులు టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూసారు. భారీ అంచనాలున్న ఈ మూవీ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్ చూసిన అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.
సలార్ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు రాత్రి నుంచే హడావుడి మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున రిలీజ్ అయిన టీజర్ నిరాశ పరిచిందని అంటున్నారు. ఇంతగా ఎదురు చేసింది మలయాళ హీరో పృథ్వి రాజ్ ను కోసం కాదని హీరో ప్రభాస్ ను చూడటం కోసమని అంటున్నారు. టీజర్ లో కనీసం ప్రభాస్ ఫుల్ ఫేస్ కూడా చూపించలేదని, సాహో సినిమా క్లైమాక్స్ షాట్స్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది సలార్ టీజర్ కన్నా ఉపేంద్ర కబ్జా టీజర్ బెటర్ అని అంటున్నారు. మ్యాడ్ మాక్స్ అనే ట్విట్టర్ యూజర్ సలార్ టీజర్ కన్నా కబ్జా టీజర్ బాగుందని ట్వీట్ చేశాడు. అలాగే కబ్జా టీజర్ ను కూడా యాడ్ చేశాడు. దీని పై ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ టీజర్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా లేదు. ట్రైలర్ లో క్లియర్ గా చూపిస్తాడని కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు నెటిజెన్లు సలార్ టీజర్ కు బదులుగా మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే వరుస పరాజయాలతో నిరాశలో ఉన్నారు. ఈ మూవీ టీజర్ ఫ్యాన్స్ ను మరింత నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు. టీజర్ ఈ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అనుకుంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ రావడం బాగోలేదని చెబుతున్నారు.
https://twitter.com/madmAAx55/status/1676771779564511232
Also Read: “ఎలివేషన్స్ ఇవ్వడంలో నీల్ తర్వాతే ఎవ్వరైనా..!” అంటూ… ప్రభాస్ “సలార్” టీజర్‌పై 15 మీమ్స్..!
End of Article