స్కంద గ్లింప్స్.. బోయపాటి ఇవి చూసుకోరా..? అంటూ నెటిజెన్ల కామెంట్స్..!

స్కంద గ్లింప్స్.. బోయపాటి ఇవి చూసుకోరా..? అంటూ నెటిజెన్ల కామెంట్స్..!

by kavitha

Ads

యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘స్కంద’. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 15న ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది.

Video Advertisement

తాజాగా ఈ మూవీకి ‘స్కంద’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ది ఎటాకర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. టైటిల్ ను ప్రకటిస్తూ ఈ మూవీ నుండి గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హీరో రామ్‌ మాస్ గా కనిపించాడు. అయితే నెటిజన్లు బోయపాటి పై కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా బోయపాటి చిత్రాలలో లాజిక్‌లు అస్సలు చూడకూడదని టాక్. దానికి కారణం ఆయన తీసే సినిమాలలో ఒకదానిలో హీరో దేవుడు అవడం, తల గాల్లోకి ఎగరడం, ఆ తలను గద్ద ఎత్తుకెళ్ళి పోవడం లాంటివి కనిపిస్తాయి. రీసెంట్ గా ‘స్కంద’ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో రామ్‌ మాస్ లుక్ లో కనిపించారు. ఆయన చెప్పిన  డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
memes on boyapati-ram pothineni movie first glimpse..!!అయితే ఈ డైలాగ్‌ రామ్ ఫైట్‌ చేసే క్రమంలో చెప్తాడు. ఆ ఫైట్ ను కోనేరులో తీశారు. అంటే వాటర్ లో జరిగిన ఈ ఫైట్ లో బోయపాటి మార్క్‌ అయిన రక్తపాతం చాలా ఎక్కువగా జరిగింది. అయితే రక్తం అంటే ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం రక్తం ఆరెంజ్ కలర్ లో కనిపించింది.
దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బోయపాటి పై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అసలు ఆరెంజ్ కలర్ రక్తం ఎందుకు వచ్చింది. రక్తంతో వాటర్ కలసినా కూడా అవి ఆరెంజ్ కలర్ లోకి మారవు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: “తను ఇవాల్టి నుండి నీ సమస్య..!” అంటూ… “నాగబాబు” పాత పోస్ట్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like