Ads
భరత్ అనే నేను , మహర్షి,సరిలేరు నీకెవ్వరు వరుస హిట్లతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ కలిసి నటించినా సర్కారు వారి పాట ఈ మే 12న ప్రేక్షకులని అలరించడానికి వచ్చేసింది. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ మంచి హిట్ అందుకుంది. మహేష్ బాబు డైలాగ్స్ పోకిరి సినిమాని మరిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు.
Video Advertisement
పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఈ సినిమాకి మహేష్ బాబు నటన మెయిన్ పిల్లర్ అయిన దానికి అతిశయోక్తి కాదు. మహేష్ బాబు ఎంట్రీ అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంతో ఎంగేజ్ గా సాగింది. సినిమా మొత్తం కూడా తనదైన టైమింగ్ తో కామెడీని పంచుతూ ప్రేక్షకులను అలరించారు. రోమాలు నిక్క పొడిచే యాక్షన్ సీన్స్లో ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి సినిమాలోని ఎనర్జీ గుర్తుకొస్తుంది. నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజ్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలు పోషించగా, సముద్రఖని విలన్ గా నటించి మెప్పించారు. ఎం ఎస్ తమన్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. సర్కారు వారి పాట లో వచ్చిన ప్రతి సాంగ్ సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకుంది.
రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను అందుకున్న సర్కారు వారి పాట రిలీజ్ తర్వాత కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు విషయానికొస్తే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ను బోకుగాడు అని తిట్టే సన్నివేశం అసందర్భం అని, అలాంటి పదాలు ఆయనపై ప్రయోగించడం పై అభిమానులు మండిపడుతున్నారు. అలాగే.. హీరోయిన్ మీద కాళ్ళేసుకొని పడుకొనే కామెడీ ట్రాక్, సుబ్బరాజు నెత్తి మీద ఉచ్చ పోసే కామెడీ ఎపిసోడ్ మరీ హేళనగా ఉన్నాయి అని, ఇది కచ్చితంగా మహేష్ బాబు రేంజ్ సినిమా కాదు అని,
మహేష్ స్థాయి సినిమాకి పడాల్సిన సన్నివేశాలు కావు అని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ఒక సందేశాన్ని ఇద్దాం అనుకున్నప్పుడు ఆయన రేంజ్ కు తగ్గట్టు సన్నివేశాలు ఉండాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
End of Article