Ads
దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ పెద్ద స్థాయికి చేరుకుంది. కానీ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా మూలంగా కొన్ని సమస్యలు ఎదురు అవుతున్నాయి. రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవానికి వెళ్లారు. అక్కడ ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించారు. అయితే నిజానికి ఆయన ప్రజెంటర్ గా వ్యవహరిస్తే ఎందుకు అందరికీ ఇబ్బందిగా ఉంది..? సోషల్ మీడియా వేదిక మీద గత కొన్ని రోజుల నుండి దీనిపై విపరీతమైన చర్చ సాగుతోంది.
Video Advertisement
ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఎవరో చేస్తున్నారు ఇదంతా కూడా.. అయితే నిజానికి ఎన్టీఆర్ విదేశాలకు వెళితే మిగిలిన వారికి ఇబ్బంది వస్తుందా..?
నిజానికి ఇక్కడ విషయం ఎన్టీఆర్ గురించి కానీ రామ్ చరణ్ గురించి కానీ కాదు. తెలుగు సినిమా గురించి. తెలుగు సినిమా గొప్పతనం గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది.ఇది నిజంగా గొప్ప విషయం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల జ్యురి మెంబర్ లో ఒకరు చరణ్ గురించి గొప్పగా మాట్లాడటం జరిగింది దాంతో కొంతమంది డబ్బు తీసుకుని చరణ్ ని పొగిడారంటూ ఆమెని తిడుతున్నారు. ఆమె పేరు మౌనిక గ్లెబర్మేన్. సోషల్ మీడియాలో విపరీతంగా ఆమెపై ట్రీట్స్ వస్తున్నాయి దాంతో ఆమె రియాక్ట్ అయ్యారు.
నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు అని ఆర్ఆర్ఆర్ సినిమా మీద అభిమానం చరణ్ మీద అభిమానంతోనే చెప్పానని మౌనిక అన్నారు. అయినా కూడా కొంతమంది ఆమెని ఇష్టం వచ్చినట్లు అంటుంటే ఆమె ఇక ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. రామ్ చరణ్ ఆమెకి సారీ కూడా చెప్పారు. ”పని లేని వాళ్ళు ఏదో అంటే మీరు ఎందుకు బాధపడాలి” అని చెప్పారు.
”పాజిటివ్ గా వుండే దాన్ని నెగటివ్ గా మార్చొద్దని… నాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని ఆర్ఆర్ఆర్ సినిమా మీద ప్రేమ రామ్ మీద ప్రేమతో నేను అన్నాను” అని చెప్పారు. అలానే మరొక ట్వీట్లో ”ఒకవేళ కనుక ఇంకా ఇది కంటిన్యూ అయితే పాడ్ కాస్ట్ లో అతను ఉంటే నేను యాక్సెస్ వున్నవారిని లిమిట్ చేస్తాను అన్నారు. పొరపాటుగా రెండు నిమిషాల పాటు ఫోటోలో ఉన్న ఒకరిని ట్యాగ్ చేస్తే నెగటివ్ గా ఉండకూడదని” ఆమె ట్వీట్ చేశారు.
End of Article