GUPPEDANTHA MANASU: ఆ సీరియల్ ద్వారానే నీకు గుర్తింపు వచ్చింది.. కానీ ఇలా ఎందుకు చేసావు “రిషి”..?

GUPPEDANTHA MANASU: ఆ సీరియల్ ద్వారానే నీకు గుర్తింపు వచ్చింది.. కానీ ఇలా ఎందుకు చేసావు “రిషి”..?

by kavitha

Ads

సీరియల్స్ కు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీరియల్ ప్రేక్షకులకు చేరువ అయ్యిందంటే, ఆ సీరియల్ లోని పాత్రలను, ఆ పాత్రలు పోషించినవారిని చాలా అభిమానిస్తుంటారు. ఇక ఆ సీరియల్ ప్రధాన పాత్రలను వారింట్లో మనుషులుగానే చూస్తారు.

Video Advertisement

ప్రస్తుత కాలంలో సీరియల్ హీరోలకి ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. అలాంటి హీరో సడన్ గా సీరియల్ నుండి తప్పుకున్నా, చనిపోయినట్టు చూపించిన ప్రేక్షకులు భరించలేరు.  గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి పాత్ర విషయంలో అదే జరిగింది.  నెట్టింట్లో రిషి ఫ్యాన్స్ సీరియల్ డైరెక్టర్ పై ఫైర్ అవడం కూడా జరిగింది.

ముఖేష్ గౌడ అంటే అంతగా తెలియకపోవచ్చు. రిషి అంటే తెలుగు ఆడియెన్స్ వెంటనే గుర్తుపడతారు. అంతగా బుల్లితెరపై గుర్తింపును, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. కన్నడ నటుడు ముఖేష్ గౌడ మొదట ప్రేమ్ నగర్ సీరియల్ తో తెలుగు వారికి పరిచయం అయ్యాడు. ఆ తరువాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సీరియల్ ప్రారంభం నుండి మంచి గుర్తింపు తెచ్చుకుని, ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సీరియల్ కి కుమార్ పంతం దర్శకత్వం వహించాడు. కుమార్ టేకింగ్, దర్శకత్వం, హీరోగా రిషిని ఎలివేట్ చేసిన తీరు, రిషిధార లవ్, ఎమోషన్స్, యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా రేంజ్ లో ఈ సీరియల్ ను చూపించి, టాప్ సీరియల్ గా నిలిపాడు.

దర్శకుడి టేకింగ్ కారణంగా రిషిధారలకు ఇంత పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఫేమ్ తో పాటు సీరియల్ నటీనటులకు పలు ఆఫర్స్ కూడా వస్తుంటాయనే సంగతి తెలిసిందే.  అలాంటి సమయంలో పాత్రలను కూడా మారుస్తూ ఉంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొన్ని రోజులుగాఈ సీరియల్ లో రిషి పాత్ర కనిపించడం లేదు. అందుకు కారణాలు ఎవరికి తెలియదు. అయితే ముఖేష్ గౌడకు సినిమా అవకాశం రావడంతో సీరియల్ చేయట్లేదు అనేది ఒక కారణం. అయితే, ముఖేష్ కు, మేకర్స్ మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయట.

దాంతో షూటింగ్స్ కి రాకపోవడంతో, బాగా విసిగిపోయిన మేకర్స్ ముఖేష్ ను తొలగించారని అంటూ రకరకాల ప్రచారాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. రిషి ఫోటోకు దండ వేయడంతో ఫ్యాన్స్ దర్శకుడి పై సోషల్ మీడియాలో తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఆ డైరెక్టర్ రిషి రాడు అంటూ వెల్లడించారు. ఈ విషయం పై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ముఖేష్ రెస్పాండ్ కాకపోవడంతో అనేక సందేహాలకు  దారితీస్తుంది. సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని,  మూవీ ఆఫర్స్ రాగానే, ఫ్యాన్స్ కు ఇలా చేయడం తప్పు,  ఒక్క పోస్ట్ షేర్ చేస్తే అయిపోతుందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: OTT లో వచ్చాక “గుంటూరు కారం”లో ఈ తప్పుని చూసి ట్రోల్స్…చూసుకోవాలి కదా గురూజీ.!


End of Article

You may also like