Ads
విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే కలిసి నటించిన లైగర్ చిత్రం లోని ఆఫత్ పాట లో ఇబ్బందికర పదం ఒకటి క్యాజువల్‌గా ఉపయోగించినందుకు నెటిజన్లు సోషల్ మీడియా లో విమర్శిస్తున్నారు. ఈ పాట ద్వారా మీరు సమాజానికి ఎటువంటి సందేశం పంపాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు.
Video Advertisement
లైగర్ మూవీ లోని ఆఫత్ పాట దాని ఇబ్బందికర సాహిత్యం కారణంగా ఇప్పుడు భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ‘భగవాన్ కే లియే చోడ్ దో ముజే’ అనే ఈ పాట లోని లిరిక్స్ అసభ్యంగా ఉన్నాయని…. అవి చిత్ర నిర్మాత యొక్క గీత రచయిత యొక్క తిరోగమన మనస్తత్వాన్ని చూపుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
‘భగవాన్ కే లియే చోడ్ దో ముజే’ అనే డైలాగ్ ఒక పాత సినిమాలో చాలా ఇబ్బందికర సన్నివేశంలో వాడడం జరిగింది. మరి అలాంటి డైలాగులు పాట మధ్యలో అంతా మామూలుగా ఎలా పెడతారు? అని కొందరు, అలాంటి డైలాగ్‌ని మోడ్రన్ సాంగ్‌లో పెట్టడం కూల్‌గా ఉంటుందని ఎలా అనుకున్నారు? అని కొందరు ఈ చిత్ర యూనిట్ ను ఎద్దేవా చేస్తున్నారు.
ఈ పాటలో ఆ పదాన్ని అంత క్యాజువల్ గా ఎలా వాడగలిగారని…. ఇది గీత రచయిత యొక్క స్త్రీ ద్వేషపూరిత దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఈ పాట యొక్క సాహిత్యం చాలా అసహ్యంగా ఉంది అని వెంటనే దీన్ని సరిదిద్దాలి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇంకా కొంతమంది ఏమో ఇలాంటి ఆడవాళ్ళని ద్వేషించే (మిసోజినిస్ట్) ఇండస్ట్రీల నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం అని అంటున్నారు. మొన్నటి వరకు ఇది బాలీవుడ్ సినిమా అని మాత్రమే అన్నారు. ఇప్పుడు తిట్టడానికి మాత్రం ఇది తెలుగు సినిమా అని గుర్తొచ్చింది.
రిలీజ్ కి ముందు నుంచే ఎన్నో విధాల ఇప్పటికే చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్న లైగర్ మూవీ కొత్త వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. ఇప్పటికే బాయ్ కాట్ లైగర్ వివాదం నుంచి ఇంకా బయటపడని విజయ్ దేవరకొండ….. ఇప్పుడు కొత్తగా తలెత్తుతున్న ఈ సమస్యల నుంచి ఎలా తప్పించుకుంటారో వేచి చూడాలి.
End of Article