2000 నోట్లు… బిచ్చగాడు-2..! ఈ లింకేమిటి సామీ..?

2000 నోట్లు… బిచ్చగాడు-2..! ఈ లింకేమిటి సామీ..?

by kavitha

Ads

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇక పై 2000 రూపాయల నోట్లను కస్టమర్లకు ఇవ్వకూడదని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలను ఇచ్చింది.

Video Advertisement

2016 లో 500, 1000 రూపాయల నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా వాటిని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. నోట్ల రద్దు నేపథ్యంలో సోషల్ మీడియాలో బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. మరి నోట్ల రద్దు అయితే ఈ చిత్రాల గురించి ఎందుకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఆర్బీఐ ప్రజలు తమ దగ్గరున్న 2000 నోట్లను సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులలో జమ చేయడం, లేదా మార్చుకోవడం  చేయాలని సూచించింది. కానీ రోజుకు ఇరవై వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు. జమ చేయడం అయితే ఎంత అయిన చేసుకోవచ్చు. ‘క్లీన్ నోట్ పాలసీ’ లో భాగంగానే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే డిసిషన్ తీసుకన్నామన్న ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇదే విషయం పై సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతుంది. దేశంలో నోట్ల రద్దుకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలకు ముడిపెడుతు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన  ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయమ తెలిసిందే. ఈ మూవీ కోలీవుడ్ లో 2016 మార్చి 4న రిలీజ్ అయ్యింది. తెలుగులో అదే ఏడాది  మే 13న విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయిన దాదాపు 5 నెలలకు పీఎం మోదీ ఇండియా లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
నిన్న ‘బిచ్చగాడు 2’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రోజే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. ఆశ్చర్యంగా ఉన్నా ఈ విషయం పై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బిచ్చగాడు మూవీకి, నోట్ల రద్దు లేదా ఉపసంహరణకు సంబంధం లేకపోయినా కాకతాళీయంగా జరగడంతో నెట్టింట్లో కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ హీరో విజయ్ ఆంటోనీని బిచ్చగాడు చిత్రాలు తీయొద్దని చెప్పాలి అంటూ కామెంట్ చేశారు. మరొకరు ‘బిచ్చగాడు 3’ తీయకుండా చూసుకోండయ్యా అని కామెంట్ చేశారు.

Also Read: ఇండస్ట్రీలో ఆయన పని అయిపోయింది అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చారు..! ఇంతకీ ఎన్టీఆర్ ఏం చేశారంటే..?


End of Article

You may also like