ఇండస్ట్రీలో ఆయన పని అయిపోయింది అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చారు..! ఇంతకీ ఎన్టీఆర్ ఏం చేశారంటే..?

ఇండస్ట్రీలో ఆయన పని అయిపోయింది అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చారు..! ఇంతకీ ఎన్టీఆర్ ఏం చేశారంటే..?

by kavitha

Ads

విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా పేరుగాంచిన ఎన్టీ రామరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగువారుండరు. సిని రంగంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆడియెన్స్ ను అలరించారు.

Video Advertisement

తెలుగు సిని చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న మహానటుడు ఎన్టీఆర్. జానపద, పౌరాణిక,  సాంఘికం చిత్రాలలో నటించి ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని చెప్పవచ్చు. కానీ ఒక సమయంలో సినిమాల్లో ఎన్టీఆర్ ప‌నైపోయింద‌నే టాక్ వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీ రామరావుగారి పద్దతి వేరు. ఆయన ఏ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత. అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాల కోసం ఫ్యాన్స్  ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు అనేవి ఎదురవడం సహజమే. అలాగే ఒక సమయంలో ఎన్టీఆర్ కు కెరీర్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. 1977 కి ముందు ఎన్టీఆర్ చిత్రాలు విడుదల అవుతున్నా, అంతకుముందులా హిట్ అవడం లేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అప్పటికే ఇండస్ట్రీలోకి  కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి యంగ్ హీరోలు రావడంతో ఎన్టీఆర్ జోరు కొంచెం తగ్గింది. ఆ సమయంలో కొంద‌రు ఎన్టీఆర్ ప‌నైపోయిందని కూడా అన్నారు. అయితే ఎన్టీఆర్ వయసు పై బడిందని ఊరుకోలేదు. సినీ పరిశ్రమలో తనకు ఎదురులేదని నిరూపించాడు.నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. ఒకే సంవత్సరంలో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్స్  ఇచ్చి అందరి నోళ్ళు మూయించారు. 1977లో ఎన్టీఆర్ కు 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. జనవరి 18న విడుదల అయిన ‘దానవీరశూరకర్ణ’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్‌ మూడు పాత్రలలో నటించి అందరిని  ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఆయ‌నే. ఈ మూవీ విజయం మరవకముందే  డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘అడవి రాముడు’ మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అదే సంవత్సరం చివరలో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ మూవీ విడుదలై  బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా ఎన్టీఆర్ 1977లో 3 చిత్రాలు చేసి రికార్డ్ సృష్టించారు.

Also Read: రియల్ TO రీల్..! “ది కేరళ స్టోరీ” లోని 4 మహిళలు ఎవరో తెలుసా..?


End of Article

You may also like