సమంత గురించి చైతూ అంత మంచిగా చెప్తే… సామ్ మాత్రం అలా అనేసింది ఏంటీ..!?

సమంత గురించి చైతూ అంత మంచిగా చెప్తే… సామ్ మాత్రం అలా అనేసింది ఏంటీ..!?

by Anudeep

Ads

టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ చైతన్య, సమంత విడిపోయి చాలాకాలం అయినా సోషల్ మీడియా మాత్రం వారిని వదలట్లేదు.
వ్యక్తిగత విషయాలు వారు ఎప్పుడు, ఎక్కడ ఏం మాట్లాడినా చైతన్య మాట్లాడితే.. సమంత గురించే అని, సమంత మాట్లాడితే చైతూ గురించే అన్నట్లు వారికి ఆపాదించే వారు.

Video Advertisement

ఆఖరికి సినిమా డైలాగులు కూడా వారి పర్సనల్ లైఫ్ కి లింక్ చేసి చూస్తున్నారు. అయితే తాజాగా కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో స్టార్‌ హీరోయిన్‌ సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపిసోడ్‌ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సమంత-నాగ చైతన్య విడాకులపై నెలకొన్న ఎన్నో సందేహాలు ఈ ఎపిసొడ్‌తో తీరుతాయని సౌత్‌ ప్రేక్షకులంత ఆసక్తిగా ఎదురుచూశారు.

అలాగే ఈ షో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామ్‌ చై గురించి అడిగే క్రమంలో కరణ్‌ జోహార్‌ మీ భర్త అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వెంటనే మధ్యలో సమంత కల్పించుకుని ‘మాజీ భర్త’ అనాలి అంటూ కరెక్ట్‌ చేసింది. వెంటనే కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా? అని అడగ్గా.. అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను.

ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను అని సమాధానం ఇచ్చింది. అయితే ఇటీవల విడుదలైన థాంక్యూ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యాంకర్ చైతన్యను ఆన్ స్క్రీన్ పై ఏ హీరోయిన్ తో మీకు కెమిస్ట్రీ బాగా కుదిరింది అని అడగ్గా.. చైతూ ఒకరని కాదు అంటూ సాయి పల్లవి తో లవ్ స్టోరీ అండ్ సామ్ అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ రెండు సమాధానాల్ని  బ్రేక్ అప్ తర్వాత అమ్మాయిలు ఇలా ఉంటారు అంటూ సమంతని, బ్రేక్ అప్ తర్వాత అబ్బాయిలు ఇలా ఉంటారు అంటూ కొల్లాయిడ్ చేసి నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్ చేస్తున్నారు.

సమంత చైతూని హస్బెండ్ అనగానే మధ్యలో కల్పించుకుని ఎక్స్ అని సరి చేసింది, చైతూ మాత్రం సమంత గురించి పాజిటివ్ గా సమాధానం చెప్పాడు. సమంతకు బాగా పొగరు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  విడాకుల అనంతరం చైతూ సామ్ ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. చైతూవి వరుసగా సినిమాలు విడుదలవుతుండగా, సమంత షూటింగ్ ల్లో బిజీగా ఉంది. నెటిజన్లు కొల్లాయిడ్ చేసిన వీడియో కింద ఉంది చూడండి.

https://www.instagram.com/reel/CgT2wa2pI6F/?igshid=YmMyMTA2M2Y=


End of Article

You may also like