Ads
సాధారణం గా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్లుగా తింటే.. బిల్లు ఎంతొస్తుంది? మహా అంటే వేలల్లో రావొచ్చు. బాగా ఖరీదైన రెస్టారెంట్ అయితే లక్షల్లో రావొచ్చు. కానీ ఈ రెస్టారెంట్ లో భోజనం చేసిన ఓ కస్టమర్ కు వచ్చిన బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.36 కోట్లు. అది ఏ రెస్టారెంట్ అనుకుంటున్నారా..అబుదాబిలోని ఫేమస్ రెస్టారెంట్ ‘సాల్ట్ బే’.
Video Advertisement
టర్కీ కి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రత్ గోక్సే చాలా మందికి సుపరిచితమే. మోచేతి పైనుంచి ఉప్పు చల్లే ఈయన విధానం తో చాలా ఫేమస్ అయ్యారు. ఈ టర్కిష్ చెఫ్ కు ప్రస్తుతం ఏడు దేశాల్లో లగ్జరీ స్టీక్ హౌస్ లు ఉన్నాయి. తాజాగా ఈయన తన సోషల్ మీడియా ఖాతాలో ఈ బిల్లును షేర్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు..
అయితే ఆ కస్టమర్స్ ఆర్డర్ చేసిన వాటిలో చాలా ఖరీదైన ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఐదు బాటిళ్ల పెట్రస్ ఉంది. దీని విలువ రూ.72.13 లక్షలు. అలాగే 2009కి చెందిన మరో రెండు బాటిళ్ల పెట్రస్ కూడా ఉంది. దీని ఖరీదు రూ.44.38 లక్షలు. ఇక బిల్లు తాలూకు వ్యాట్ రూ.6.40 లక్షలు. ఇక అందులో 24 క్యారెట్ బంగారం కోటింగ్ తో కూడిన ఓ ఐటెమ్ కూడా ఉంది. వీటితో పాటు ఇంకా కొన్ని ఖరీదైన ఫుడ్ ఐటెంలతో కలిసి బిల్లు మొత్తంగా రూ.1.36 కోట్లు అయింది.
ఈ బిల్లుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు.. అంత బిల్లు రావడాన్ని సమర్థిస్తే మరికొందరు తప్పు పడుతున్నారు. విలాసాల పేరుతో డబ్బు తగలేస్తున్నారని మండిపడుతున్నారు. మరి కొందరు చెఫ్ నుస్రత్ గోక్సే ను తప్పు పడుతున్నారు. పేదరికం నుంచి వచ్చిన ఆయన పేదలకు అందుబాటులో ఉండేలా కాకుండా ఇంత భారీ ఎత్తున బిల్స్ వేయడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.
End of Article