ఆ డైరెక్టర్ తో కంపేర్ చేసినందుకు అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

ఆ డైరెక్టర్ తో కంపేర్ చేసినందుకు అనిల్ రావిపూడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

by Anudeep

Ads

కామెడీ అండ్ యాక్షన్ మిక్సింగ్  కంటెంట్ తో  సినిమాలతో  సక్సెస్ సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి. పటాస్, సుప్రీమ్, సరిలేరు నీకెవ్వరు, f2 సినిమాలతో సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి. తన సినిమాలలో కామెడీ శాతం ఎక్కువ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు.

Video Advertisement

ఎఫ్ 2 సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని తన వైపుకు తిప్పేసుకున్న అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకున్నారు.

అయితే.. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మనసు కొల్లగొడుతున్నా… కొంత నెగటివ్ టాక్ కూడా వస్తోంది. మరో వైపు అనిల్ రావిపూడి పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటె.. అనిల్ రావిపూడి కూడా ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ఇటీవల.. ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ చేసారు.

నేను డైరెక్టర్ సుకుమార్ లా “పుష్ప” సినిమాను తీయలేనని.. సుకుమార్ తనలాగా “కామెడీ” సినిమాలు తీయలేరని కామెంట్ చేసారు. దీనితో.. సుక్కు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సుకుమార్ తో కంపేర్ చేసుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా.. సుకుమార్ తీసిన ఆర్య, ఆర్య 2 , 100 % లవ్ లాంటి సినిమాలలో కామెడీ బాగుంటుందని.. ఆ సినిమాలు చూడలేదా..? అంటూ అనిల్ రావిపూడిని ప్రశ్నిస్తున్నారు.


End of Article

You may also like