“ఈ ఒక్క సీన్‌కి అంత అవసరమా..?” అంటూ… “సర్కారు వారి పాట” డైరెక్టర్‌పై నెటిజన్స్ కామెంట్స్..!

“ఈ ఒక్క సీన్‌కి అంత అవసరమా..?” అంటూ… “సర్కారు వారి పాట” డైరెక్టర్‌పై నెటిజన్స్ కామెంట్స్..!

by Anudeep

Ads

ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

Video Advertisement

ఈ సినిమాకి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొంత మంది, “మహేష్ బాబు ఈ సినిమాలో చాలా బాగా నటించారు, చాలా కొత్తగా కనిపించారు” అని అంటూ ఉంటే, ఇంకొంతమంది, “కథలో కొత్తదనం లేదు” అంటున్నారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సినిమాకి పాటలు ఒక ముఖ్య హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. కీర్తి సురేష్ ఇప్పటివరకు ఇలాంటి పాత్ర పోషించలేదు. సముద్రఖని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు.

అయితే.. ఈ సినిమాలో మహేష్ బాబు సముద్ర తీరం వద్ద ఫైట్ చేసే సీన్ ఒకటి ఉంది. ఈ ఫైట్ సీన్ ట్రైలర్ లోనే హైలైట్ అయింది. అయితే.. ఈ ప్లేస్ చూసి ఎక్కడో సముద్రం వద్ద తీశారు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అది అంతా నిజం కాదు. ఆ సముద్రం సెట్ అంత VFX ఎఫెక్ట్ అట. నిజంగా సముద్ర తీరం కాదట. ఎంతైనా ఈ టెక్నాలజీ చేసే మాయలని చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేం. ఆ గ్రాఫిక్స్ కోసం సినిమా బృందం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సేమ్ ఒరిజినల్ లొకేషన్ లాగా ఉండేలాగా గ్రాఫిక్స్ అని ఎక్కడా తెలియకుండా అంత బాగా కనిపించేలాగా చూసుకున్నారు.

sarkaruvaripata 1

దీనితో నెటిజన్స్ డైరెక్టర్ పరశురామ్ ను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ వాళ్ళైతే.. అంతగా బీచ్ వద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేయాలనీ అనుకుంటే.. ఒరిజినల్ గా వైజాగ్ లో బీచ్ ల వద్దే షూటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు కదా.. దానికోసం అమీర్ పేట్ ఎడిట్స్ ను వాడాల్సిన అవసరం ఎందుకు ఉంది సార్..? అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు.

parasuram


End of Article

You may also like