మా “సర్కారు వారి పాట” సినిమాని ఇలా చేశారేంటండీ..? వైరల్ అవుతున్న తమిళ్ డబ్బింగ్ వెర్షన్..!

మా “సర్కారు వారి పాట” సినిమాని ఇలా చేశారేంటండీ..? వైరల్ అవుతున్న తమిళ్ డబ్బింగ్ వెర్షన్..!

by Anudeep

Ads

రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గాను పరశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గాను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మాణ సారథ్యం వహించారు. మన సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీత దర్శకత్వం వహించారు.

Video Advertisement

థమన్ సంగీత దర్శకత్వం అందించిన ఒక్కో పాటకీ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్ వచ్చాయి అని చెప్పవచ్చు. ఒక పాటను మించి ఒక పాట ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఒక్కొక్క పాటకి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయంటే ఎంత హిట్ అయ్యాయో వేరే చెప్పవలసిన అవసరం లేదు.

ఇప్పుడు ఈ సర్కారు వారి పాట చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో పాటు తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో అంత ఆకట్టుకున్న ఈ చిత్రం సంగీతం, తమిళ్లో వినడానికి అంత వినసొంపుగా లేదు అంటున్నారు అభిమానులు.

మన తెలుగులో ఇంత హిట్ అయిన ఈ సాంగ్స్ తమిళ్ లో వినడానికి అంత బాగోలేదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మా మా మహేషా అనే పాట మాత్రం ఏదో ముసలివారితో పాడిచినట్లు ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే డైలాగ్స్ డబ్బింగ్, వారికి ఇచ్చిన వాయిస్ లు కూడా అస్సలు సరిగ్గా లేదు. మన తెలుగులో అంత హిట్ అయిన పాటలని తమిళ్ లో అసలు కొంచెం కూడా జాగ్రత్త తీసుకోకుండా పాడించారు. అంత ఆతృతగా తమిళంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయకపోతే కొంచెం టైం తీసుకొని పర్ఫెక్ట్ గా డబ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎంత పెద్ద హీరో సినిమాని ఈ విధంగా చేసేసారు ఏంటి అని అభిప్రాయం వ్యక్తంచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


End of Article

You may also like