లంక సెట్ ను ఆ మార్వెల్ మూవీ నుంచి కాపీ చేశారా..? ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

లంక సెట్ ను ఆ మార్వెల్ మూవీ నుంచి కాపీ చేశారా..? ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించిన ‘ఆది పురుష్’ సినిమా జూన్ 16న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ రిలీజ్ తో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత ఈ చిత్రం పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. పాత్రల వేషధారణ, సంభాషణల పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఎప్పటి కప్పుడు మూవీలోని కొత్త విషయాలను గమనిస్తూ మూవీ పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెటిజెన్లు ఈ మూవీలోని మరో విషయాన్నీ గమనించి, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..adipurush-copying-thors-asgardఆది పురుష్ 500 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించారు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ, ఈ మూవీ త్రీడిలో తీయడంతో ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తితో ఎదురుచూశారు. హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ పై వివాదం రాగా, మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించింది.ఆదిపురుష్ వివాదాలు, విమర్శల మధ్య బాక్సాఫీసు దగ్గర కొనసాగుతోంది. మూడు రోజుల్లో 340 కోట్లు వసూల్ చేసిన ఈ మూవీ, నాలుగవ రోజు దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు అంటున్నారు. ఈ మూవీ దర్శకుడు ఓంరౌత్ ను, రచయితను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని మరొక విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఈ మూవీలో చూపించిన లంక సీన్ ను హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేసినట్లు గమనించారు. ఆ సినిమా ఏమిటంటే థోర్, ఆ  సినిమాలోని అస్గార్డ్ సెట్ ను కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అందులో గోల్డ్ కలర్ లో ఉంటే, ఆదిపురుష్ బ్లాక్ కలర్ లో చూపించారని  డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/Ctk_LxnxDVe/?utm_source=ig_embed&utm_campaign=loading

Also Read: “ఆదిపురుష్” విషయంలో… “వేణు స్వామి” చెప్పిందే జరుగుతోందా..?


End of Article

You may also like