చిన్ననాటి మిత్రుడు థియేటర్ లో టికెట్స్ కొడుతూ కనిపించాడు.. తరువాత అతని స్టేటస్ ఏంటో తెలిసాక ఏమైందంటే..?

చిన్ననాటి మిత్రుడు థియేటర్ లో టికెట్స్ కొడుతూ కనిపించాడు.. తరువాత అతని స్టేటస్ ఏంటో తెలిసాక ఏమైందంటే..?

by Megha Varna

Ads

చాలా మంది మనిషి యొక్క బట్టల్ని చూసి అంచనా వేస్తూ ఉంటారు. అలానే వాళ్ళు చేసే పనిని చూసి అంచనా వేస్తూ ఉంటారు. కానీ నిజానికి అలా అంచనా వేయడం తప్పు. ఎందుకంటే సాదాసీదాగా ఉన్నవాళ్లు ధనవంతులు కూడా అవ్వచ్చు. టిప్ టాప్ గా తయారైన వాళ్ళు కేవలం పోజే కొడుతూ ఉండచ్చు. మంచి పొజిషన్ లో ఉండి కూడా వాళ్లకి నచ్చక నార్మల్ గా ఉంటూ ఉండొచ్చు. అందుకనే వేషధారణ బట్టి చేసే పనిని బట్టి ఎప్పుడూ కూడా ఒకరి అంచనా వేయడం మంచిది కాదు. అయితే దీనికి తగ్గ ఒక చిన్న సన్నివేశం గురించి చూద్దాం. అప్పుడు ఇలా చేయడం తప్పు అని మీకే అర్థమవుతుంది.

Video Advertisement

ఒక జంట సినిమా కి వెళ్లారు. సినిమా కి వెళ్లి టికెట్ తీసుకుని లోపలికి వెళుతుంటే… టికెట్లు చింపే వ్యక్తి అతన్ని పలకరించాడు. అయితే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి నేల టికెట్లు తీసుకుని సినిమా చూసేవారు. టికెట్లు చింపే వ్యక్తి ఇద్దరికీ టికెట్లు తీసేవాడు. అయితే మొహమాటానికి ఏదో పలకరించేసి వచ్చేసాడు లోపలికి భార్యతో. ఆ తర్వాత ఇంకా సినిమా మొదలు అవ్వక పోయేసరికి భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నారు. అతను మీ స్నేహితుడ అని అడిగింది భార్య.

అవును చిన్నప్పుడు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము. కలిసి సినిమాలు చూసే వాళ్ళం అని చెప్పాడు. మరి మీ స్నేహితుడు అయితే ఎందుకు అలా మొహమాటానికి పలకరించి వచ్చేశారు..? ఆప్యాయంగా మాట్లాడాలి కదా అని అడిగింది. తన పొజిషన్ ఇప్పుడు బాగోలేదు కదా నన్ను ఏమైనా అప్పు అడుగుతాడేమో అని పలకరించలేదు అని బదులిచ్చాడు భర్త. ఆ తర్వాత ఇంటర్వెల్ లో ఒక కుర్రవాడు డ్రింక్స్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. డబ్బులు తీసి ఇస్తుంటే మీ ఫ్రెండ్ పంపించారు అని చెప్పాడు.

చూసారా మీ స్నేహితుడు ఎంత మంచి వాడో. వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి అని చెప్పింది. సినిమా అయిపోయాక ఆ టికెట్లు చింపే వ్యక్తి ఎక్కడ అని అడిగేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి పైకి తీసుకు వెళ్ళాడు. ఏసీ గదిలో సోఫాలో కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ భార్య భర్త వెళ్లేసరికి ఆశ్చర్యపోయారు. అప్పుడు తెలిసింది టికెట్లు చింపడం అతని పని కాదని.. థియేటర్ యజమాని అని.

ఈరోజు టికెట్ల చెప్పే వ్యక్తి సెలవు పెట్టడంతో తానే టికెట్లు చింపాడట. ఆ తర్వాత ఇంటికి కారుని డ్రైవర్ ని ఇచ్చి పంపించాడు. అప్పుడు దారిలో భార్య ఇలా ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి. స్టేటస్ ముఖ్యం కాదు స్నేహం ముఖ్యం అని భర్తకు చెప్పింది. కనుక ఏ వ్యక్తిని కూడా మొదట చూడగానే అంచనా వేయడం మంచి పని కాదు.

Also Read: ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?


End of Article

You may also like