మామూలుగా పెళ్లి అంటే ఆడపిల్లలు సిగ్గుతో తలదించుకుని ఉంటారు అనే ఒక అపోహ ఉంది. అదంతా చెరిపేస్తూ ఆడ పిల్లలు కూడా తమ పెళ్లి వేడుకని ఆనందంగా జరుపుకుంటారు అని ఎంతోమంది అమ్మాయిలు నిరూపించారు. ఇటీవల ఒక యువతి కూడా అలాగే తన పెళ్లిలో బారాత్ లో డాన్స్ వేస్తూ వైరల్ అయ్యారు.

bullet bandi

జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఈ నెల 14వ తేదీన అశోక్ తో వివాహం జరిగింది. అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అయితే శ్రీయ బారాత్ లో బుల్లెట్టు బండెక్కి పాటకి డాన్స్ వేశారు. ఈ పాటని మోహన భోగరాజు పాడారు. ఈ ఆల్బమ్ పాట ఇటీవల యూట్యూబ్ లో విడుదలయి వైరల్ అయ్యింది.

bullet bandi 2

ఈ పాట బాగా వైరల్ అవడం తో పాటు శ్రీయ కు మంచి ఆఫర్ కూడా వచ్చింది. ఆమె డాన్స్ వేసిన పాటను బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ నిర్మించింది. లక్ష్మణ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా.. గాయని మోహన భోగరాజు ఈ పాటను ఆలపించారు. ఈ పాట వైరల్ అయినా నేపధ్యం లో సంస్థ నిర్వాహకులు నిరూప సాయి శ్రీ తో ఫోన్ లో ముచ్చటించారు. తమ సంస్థ ఆధ్వర్యం లో నిర్మించే మరో పాటకు నటించాలంటూ సాయి శ్రీయ ను కోరారు. శ్రీయ కూడా అందుకు సంతోషం తో అంగీకారం తెలిపారు.