2023లో సత్తా చాటిన కొత్త దర్శకులు వీరే….!

2023లో సత్తా చాటిన కొత్త దర్శకులు వీరే….!

by Mounika Singaluri

సినిమా ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది.2023 సంవత్సరంలో చాలా మంది కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.అయితే వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.

Video Advertisement

బలగం వేణు నుంచి రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న శౌర్యువ్ వరకు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా వారి సత్తా చాటి అదుర్స్ అనిపించారు.

Balagam movie review

2023 మొదట్లోనే రైటర్ పద్మభూషణ్ సినిమాతో తొలి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు షణ్ముఖ్ ప్రశాంత్. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంవత్సరం సంచలన విజయాల్లో ఒకటి దసరా. న్యాచురల్ స్టార్ నాని హీరోగా డిబటెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా. శ్రీకాంత్ మీద నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

అలగే సుమంత్ ప్రభాస్ అనే కుర్ర దర్శకుడు కూడా తన డైరెక్షన్ లో తీసిన మేమ్ ఫేమస్ తో హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా తొలి సినిమా అవ్వడమే కాదు హీరోగా కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ కూడా తన సత్తా చాటాడు. ఇక మ్యాడ్ సినిమాతో యూత్ ఫుల్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ శంకర్. యుత్ మెచ్చేలా సినిమా తీసి మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ అనిపించాడు. ఈ నెలలో రిలీజైన హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నాని. ఆల్రెడీ దసరా తో శ్రీకాంత్ కి తొలి అవకాశం ఇచ్చిన నాని హాయ్ నాన్నతో శౌర్యువ్ సత్తా చాటాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు మరో సెన్సిబుల్ డైరెక్టర్ దొరికాడు.


You may also like

Leave a Comment