Ads
భారత్ లో ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకురాబోతోంది. ఈ చట్టాల ప్రకారం దేశం లో మూడు రోజుల వారాంతపు సెలవు అమలు లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల సోమవారం ప్రవేశ పెట్టబడిన బడ్జెట్ లో ఈ విషయమై కార్మిక మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేస్తోంది. దేశం లో నాలుగు రోజుల పని, మూడు రోజుల వారాంతపు సెలవులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు.
Video Advertisement
కంపెనీ మరియు ఉద్యోగులు పరస్పర అంగీకారం తోనే ఈ నియమాలు అమలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నియమాల ప్రకారం పని గంటలను 12 గంటలకు పెంచనున్నారు. వారానికి గరిష్టం గా 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. రోజుకు 12 గంటల చొప్పున వారానికి నాలుగు రోజులు పని చేస్తే.. మూడు రోజుల వారాంతపు సెలవు లభిస్తుంది. ఇది ఉద్యోగి, కంపెనీ పరస్పర అంగీకారం పైనే అమలు చేసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్ఓ కి సంబంధించి కూడా బడ్జెట్ లో పన్ను విధించే అంశాన్ని ప్రస్తావించారు. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం లో పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగి కంట్రిబ్యూషన్ పై మాత్రమే పన్ను విధించనున్నారు. కంపెనీ ఇచ్చే కంట్రిబ్యూషన్ పై ఎలాంటి భారం ఇకపై ఉండదు.
End of Article