పుష్ప-2 సినిమాకి మరొక ఆఫర్..! సినిమా రేంజ్ మామూలుగా లేదుగా..?

పుష్ప-2 సినిమాకి మరొక ఆఫర్..! సినిమా రేంజ్ మామూలుగా లేదుగా..?

by Mohana Priya

Ads

రోజు రోజుకీ పుష్ప సినిమాకి క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పటికే మొదటి పార్ట్ చాలా పెద్ద డిస్కషన్ అవ్వడం, మళ్లీ ఇప్పుడు అల్లు అర్జున్ కి ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడం ఈ విషయాలు అన్నీ కూడా పుష్ప సినిమా నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అని ఆసక్తిని పెంచాయి.

Video Advertisement

ఈ సినిమా నుండి అల్లు అర్జున్ కి సంబంధించి ఒక వీడియో, ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి కొన్ని డైలాగ్స్ కూడా లీక్ అయ్యాయి. అల్లు అర్జున్, రష్మిక పాత్రలు మాట్లాడుకుంటున్న డైలాగ్ ఇందులో ఉన్నాయి.

రెండవ పార్ట్ కూడా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాకి మూడవ పార్ట్ ఉంటుంది అనే వార్త కూడా వచ్చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరొక న్యూస్ కూడా బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కుల కోసం 1000 కోట్ల వరకు ఆఫర్ వచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంత భారీ ఆఫర్ రావడం ఇదే మొదటిసారి.

అంటే ఈ సినిమా రేంజ్ ఎలా ఉందో ఈపాటికి అర్థం అయిపోయి ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే పరిస్థితి ఇలా ఉంటే, ఇంక రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో అని అంటున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి అంటే కూడా చాలా భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు సినిమా బృందం. అందుకే ప్రతి విషయంపై చాలా శ్రద్ధ పెడుతున్నారు.

ALSO READ : MISS శెట్టి MR పోలిశెట్టి సినిమాని చూసిన చిరంజీవి..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like