అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా Miss శెట్టి Mr పోలిశెట్టి. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల అవుతోంది. ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు.

Video Advertisement

అనుష్క కూడా ఈ సినిమా కోసం కొన్ని ఇంటర్వ్యూలు రికార్డ్ చేసినట్టు సమాచారం. అవి సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఇప్పుడు చిరంజీవికి స్పెషల్ ప్రివ్యూ వేసి చూపించారు. సినిమా చూసిన చిరంజీవి సినిమా బృందాన్ని అభినందించారు.

miss shetty mr polishetty censor review

సినిమా బాగుంది అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. దీనికి సినిమా బృందం వాళ్ళు కూడా స్పందించి చిరంజీవికి థాంక్స్ చెప్పారు. అంతేకాకుండా చిరంజీవితో వారు దిగిన ఫోటోలు షేర్ చేసుకొని వారి ఆనందాన్ని ప్రేక్షకులకి పంచుకున్నారు. చిరంజీవి రివ్యూ ఇచ్చేశాక ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది.

ట్రైలర్ చూసిన తర్వాత ఒక క్లారిటీ ఉన్న అమ్మాయికి, కాస్త కన్ఫ్యూజన్ ఉన్న అబ్బాయికి మధ్య జరిగే సినిమా ఇది అని అర్థం అవుతోంది. కాన్సెప్ట్ కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంది. సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది. సినిమాకి కామెడీ చాలా పెద్ద ప్లస్ అయ్యింది అని చెప్పారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : “చంద్రముఖి” సినిమాలో చూపించిన కథ అంతా నిజం కాదా..? అసలు కథ ఏంటంటే..?