• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

స్వీట్స్ షాప్ కి వెళ్లే వాళ్లకి స్వీట్ న్యూస్… ఓనర్స్ కి దిమ్మతిరిగే న్యూస్!!! ఇకపై అలా చేయడానికి లేదు..!

Published on February 27, 2020 by Anudeep

స్వీట్స్ ఇష్టపడని వాళ్లెవరైనా ఉంటారా ? కలాకండ్,గులాబ్ జామూన్, లడ్డూ, జిలేబి ఇలా ఎన్నో నోరూరించే రకరకాల స్వీట్లు చూడగానే టెంప్ట్ అవ్వని వారుంటారా? కానీ మనం కొనే స్వీట్స్ ప్రతిసారి బాగుంటాయని చెప్పలేం . ఎందుకంటే ప్యాకెజ్డ్ ఫూడ్ పై ఎమ్ఆర్పీ తో పాటు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది . కానీ లూజ్ గా అమ్మే స్వీట్స్ పై అలాంటి వివరాలేవీ ఉండవ్ . దాంతో కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం. కాబట్టి  లూజ్ స్వీట్స్ వాటి ఎక్స్పైరీ డేట్ విక్రయదారులే చెప్పాలి అంటున్నారు ఫూడ్ సేప్టి అధికారులు . అవునండి ఇకపైన లూజ్ స్వీట్లు అమ్మేటప్పుడు అవి ఎప్పుడు తయారు చేశారు,ఎన్ని రోజుల వరకు తినొచ్చు అనేది ఖచ్చితంగా షాపుదారుడు చెప్పి తీరాల్సిందే . వివరాలు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్ పై మ్యానుఫ్యాక్చర్  తేదీ , బెస్ట్ బిఫోర్ డేట్ కచ్చితంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ నిబంధన ప్యాకేజ్డ్ స్వీట్లకు మాత్రమే వర్తించేది. ఇకపై విడిగా లూజ్ గా అమ్మే స్వీట్స్ కి  కూడా వర్తిస్తుంది. 2020 జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధలు అమల్లోకి రానుంది . చాలా వరకు షాపుల్లో ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన స్వీట్లను అమ్ముతున్నారని, దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు  ఈ నిబంధనని తీసుకొచ్చారు.

రసగుల్లా, బాదం మిల్క్, రసమలై లాంటి స్వీట్లు తయారు చేసిన సమయం నుంచి 48 గంటల వరకు మాత్రమే బాగుంటాయి. అంటే తయారు చేసిన రెండు రోజుల వరకు మాత్రం తినడానికి పనికొస్తాయి. ఆ తర్వాత వాటిని పారేయాల్సిందే. లడ్డూలైతే వారం రోజుల్లో బూజు వచ్చేస్తాయి . స్పెల్ కూడా వస్తుంది అవి గమనించకుండా మనం కొన్నప్పటికి పారేయాలి తప్ప తినలేం. తిన్నామంటే ఆరోగ్యం పాడవడం గ్యారంటీ. ఈ విషయాలు తెలిసినప్పటికి కొంతమంది  డేట్ అయిపోయినా స్వీట్లను వినియోగదారులకు అంటగడుతుంటారు. ఇలాంటి వాటిని అరికట్టడానికే ఈ స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చారు.

జూన్ ఒకటి నుండి ఈ రూల్ అమలవుతుంది . ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీస్కొక తప్పదని హెచ్చరించారు అధికారులు . ఈ నిబందన పట్ల వినియోగదారులు హర్శం వ్యక్తం చేస్తున్నారు. ఇకపైన డేట్ అయిపోయిన స్వీట్స్ ని అమ్మి వినియోగదారులని మోసం చేయలేరు . కాబట్టి బహుపరాక్ స్వీట్ షాప్ ఓనర్స్ , బి హ్యాపీ స్వీట్ లవర్స్ .

 

 


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!
  • ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?
  • చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే… ఈ ఐదింటి వెనుక వుండే రహస్యం తెలుసుకోవాల్సిందే..!
  • నాగచైతన్య పెంపకంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అమల.. వాళ్ళ అమ్మ దగ్గర పద్ధతిగా పెరిగాడంటూ..!!
  • బడి నుండి ఆమెని గెంటేసినా.. ఆమె మాత్రం చదువులో వెనుకపడలేదు…ఈ విద్యార్థి కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions