Ads
మొన్నటి వరకు ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా లాక్ డౌన్ సడలించగానే రెక్కలొచ్చిన పక్షుల్లా రోడ్లపైకి చేరారు..అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ రోడ్లే.. రోడ్ల మీద ఎక్కడా ఖాళీ లేకుండా గతంలో మాదిరిగానే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.. కరోనా భయం ఏ ఒక్కరిలోనూ లేదు.. సరే కరోనా కి భయపడకపోతే పోయారు..ట్రాఫిక్ చలానలకు మాత్రం భయపడాల్సిందే…ఎందుకు భయపడాలి మా దగ్గర ఆర్ సి , లైసెన్స్, పొల్యుషన్ చెక్ రిపోర్ట్ ఉన్నాయి..హెల్మెట్ కూడా పెట్టుకున్నాం అని అంటారా..ఇప్పుడు అవి మాత్రమే సరిపోవు.. మరేం కావాలి… హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు..అవేంటంటే..
Video Advertisement
ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎంతమంది మరణిస్తున్నా చాలామంది హెల్మెట్ పెట్టుకునే విషయంలో అశ్రద్ద వహిస్తుంటారు..గతంలో పెంచిన ట్రాఫిక్ చలాన్ల భయానికి అయినా హెల్మెట్స్ పెట్టుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు..కానీ ఇకపై బైక్ డ్రైవ్ చేసేవారు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు..వారితో పాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకుని తీరాల్సిందే..లేకపోతే..ఫైన్..
బైక్ కొనుక్కోగానే అందరూ చేసే మొదటి పని సైడ్ మిర్రర్స్ తీసేయడం..సైడ్ మిర్రర్స్ ఉంటే బైక్ షో పోతుంది అని కొందరి వాదన..సైడ్ మిర్రర్స్ లో చూడకుండా కూడా మేం డ్రైవ్ చేయగలం అని కాలరెగరేసేవారు కొందరు.. ఇకపై అలాంటి వాదనలు చెల్లవు..సైడ్ మిర్రర్స్ లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని..కాబట్టి ప్రతి వెహికిల్ కి సైడ్ మిర్రర్స్ ఉండాల్సిందే అనేది మరో కొత్త రూల్.. లేకపోతే ఫైన్..
వెహికిల్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి లైసెన్స్ తప్పనిసరి..కానీ లైసెన్స్ లేకుండానే బండి తీసేవారు కూడా లేకపోలేదు..మరికొందరు మా దగ్గర లెర్నింగ్ లైసెన్స్ ఉందని వారికి ఇష్టం వచ్చినట్టు బండి నడిపిస్తుంటారు..ఇకపై అలాంటి పప్పులేం ఉడకవు..మీ దగ్గర లైసెన్స్ లేకపోతే అసలు బండి నడపడానికే అనర్హులు ..ఇక లెర్నింగ్ లైసెన్స్ ఉంటే వారి వెనుక ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న మరో వ్యక్తి ఉండాల్సిందే..
ఇవండీ హైదరాబాద్ లో అమలు కాబోయే సరికొత్త ట్రాఫిక్ నిబంధనలు..కాబట్టి తస్మాత్ జాగ్రత్తా..
End of Article