దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్.. ఇది “టమాటో ఫ్లూ” కాదా? మరేంటి?

దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్.. ఇది “టమాటో ఫ్లూ” కాదా? మరేంటి?

by Anudeep

Ads

కరోనా మహమ్మారి బెడద తగ్గిందిలే అని అనుకుంటుండగానే.. మరో కొత్త వైరస్ అంటూ వచ్చే వార్తలు హడలు పుట్టిస్తూ ఉన్నాయి. తాజా దక్షిణాది రాష్ట్రాలలో మరో కొత్త వైరస్ గురించి చర్చ నడుస్తోంది. దీనిని టమాటో వైరస్ ఆ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది టమాటో వైరస్ కాదని నిపుణులు చెబుతున్నారు.

Video Advertisement

తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలో హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (హెచ్ఎఫ్ఎండీ) వైరస్ స్ప్రెడ్ అవుతోంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కలుగుతోంది.

tomato 1

అయితే ఈ వ్యాధి బారిన పడిన వారు త్వరగానే కోలుకుంటున్నారు. వ్యాప్తి కూడా తక్కువగా ఉంటోంది. చాల అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ వ్యాధి మెనింజైటిస్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే స్పందించి వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదు. కానీ తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.

tomato 2

తొలుత ఈ వైరస్ టమాటో వైరస్ అని ప్రాచుర్యం పొందడం వలన టమాటో తినడం వల్ల వస్తుంది అని భావించారు. కానీ, ఈ వైరస్ టమాటో తినడం వల్ల రాదు. ఇది కేవలం వైరల్ డిసీజ్ మాత్రమే. జలుబు, దగ్గు, డయేరియా, ముక్కు కారణం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


End of Article

You may also like